క్రికెట్ ప్రపంచంలో ఎందరో సేహితులుగా ఉంటారు. కానీ.. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీల స్నేహం ప్రత్యేకం. దాదాపు 30 సంవత్సరాలకు పైగా వారిద్దరు మంచి స్నేహితులు. మధ్య మధ్యలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పటికీ.. వారి స్నేహం ముందు అవి ఎక్కువ కలం నిలవలేదు. టెండూల్కర్, కాంబ్లీ ఇద్దరు.. వారి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందుతున్న సమయంలోనే ఫ్రెండ్స్ అయ్యారు. 1988లో హారిస్ షీల్డ్ సెమీ-ఫైనల్‌లో సెయింట్ జేవియర్స్ హైస్కూల్‌పై టెండూల్కర్ 326 నాటౌట్, కాంబ్లీ 349 నాటౌట్ వ్యక్తిగత స్కోర్‌లతో 664 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో ప్రపంచానికి తమ రాకను ప్రత్యేకంగా చాటారు. సచిన్ 1989లో భారత్ జట్టుకి అరంగేట్రం చేస్తే.. కాంబ్లీ 1990లో అరంగేట్రం చేశాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడుపుతూ ఓ రెసిడెన్షియల్ సొసైటీ గేట్ ను ఆయన కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటన ముంబైలోని బాంద్రా సొసైటీలో చోటు చేసుకుంది. దీంతో ఆ కాలనీ వాసులు, కాంబ్లీ మధ్య గొడవ జరిగింది. సొసైటీవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. ప్రమాదకరంగా వాహనం నడపడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలిగించారని ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) 279, 336, 427 సెక్షన్ల కింద వినోద్ కాంబ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. 17 టెస్టులు ఆడిన కాంబ్లీ 1084 పరుగులు నమోదు చేయగా.. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 104 వన్డేలలో 2477 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి.1990లో ఇండియా తరపున అరంగ్రేటం చేసిన కాంబ్లీ 2000 అక్టోబరులో చివరి మ్యాచ్ ఆడాడు.
Sachin Tendulkar and Vinod Kambli returning to the pavilion after their unbeaten partnership of 664. pic.twitter.com/Eiy63hQ3fP
— Cricfinity (@cricfinity) February 19, 2022