టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతడిని తప్పించడం పక్కా అనిపిస్తుంది. మరి ఆ పదవిలో నెక్స్ట్ ఎవరు?
టీమిండియా మేనేజ్ మెంట్ చిక్కుల్లో పడింది. ఎందుకంటే సాక్షాత్తూ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మనే స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయాడు. జట్టు గురించి ఎవరికీ తెలియని నిజాలన్నీ బయటపెట్టేశాడు. కోహ్లీ అంటే గంగూలీకి అస్సలు పడదని, పలువురు స్టార్ క్రికెటర్లు ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారని చేతన్ శర్మ చెప్పేశాడు. కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య ఇగో విషయంలో గొడవలు జరిగాయని కూడా రివీల్ చేశాడు. దీంతో క్రికెట్ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే.. చేతన్ శర్మని పక్కకు తప్పించడం గ్యారంటీ అని తెలుస్తోంది.
ఇక విషయానికొస్తే.. ఒకవేళ చేతన్ శర్మని చీఫ్ సెలెక్టర్ గా తప్పిస్తే ఆ స్థానంలోకి తర్వాత వచ్చేది ఎవరు? అనే దాని గురించి అప్పుడే సోషల్ మీడియాలో మాట్లాడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ బౌలర్ డనేష్ కనేరియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోనీని చీఫ్ సెలెక్టర్ గా తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చాడు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ సీజన్ అతడికి చివరది అని అంటున్నారు. ఒకవేళ బీసీసీఐకి అలాంటి ఆలోచన ఉంటే మాత్రం టీమిండియాలో మార్పులు వచ్చే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
‘ధోనీని సెలెక్షన్ కమిటీలోకి ముందు తీసుకోండి. దీనికోసం ధోనీ మాట్లాడి.. అతడి నెక్స్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి. ధోనీ.. టీమిండియాలో పార్ట్ నర్ ని చేయడానికి ఇదే మంచి టైం. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా.. ఆ దిశగా ఆలోచించాలి. ధోనీ నేతృత్వంలో కొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పాటు చేయండి. టీమిండియాకు దొరికిన తెలివైన క్రికెటర్లలో ధోనీ ఒకడు. అతడి లాంటి వ్యక్తి భారత క్రికెటర్లని పర్యవేక్షించే స్థానంలో ఉండే మంచిది’ అని పాక్ మాజీ బౌలర్ డానేష్ కనేరియా అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరు నెటిజన్స్ కూడా ఇలానే అన్నారు. మరి మనం అందరం అనుకోవడానికి ముందు ధోనీ కూడా ఈ దిశగా ఆలోచించాలి. అప్పుడే అన్ని సెట్ అవుతాయి. మరి ధోనీ చీఫ్ సెలెక్టర్ అని వస్తున్న వార్తలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.