మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. దేశానికి రెండు వరల్డ్ కప్స్ అందించిన ఘనత ధోనికే దక్కుతుంది. ధోని కెప్టెన్సీ నుండి తప్పుకున్న తరువాత ఇప్పటి వరకు టీమ్ ఇండియాకి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ టీ- ట్వంటీ వరల్డ్ కప్ ని సీరియస్ గా తీసుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ అంగీకారంతోనే.. ధోనిని టీమ్ ఇండియా మెంటర్ గా నియమించారు. ఈ నిర్ణయం కచ్చితంగా టీమ్ కి కలసి వచ్చే అంశమే. అయితే.. ధోనికి ఇప్పుడు బీసీసీఐ కాంట్రాక్ట్ లేదు. కేవలం ఈ వరల్డ్ కప్ కోసమే టీమిండియా ధోనిని మెంటర్ గా సెలక్ట్ చేశారు. మరి.. అన్ని రోజులు టీమ్ తో పాటు.. ధోని దుబాయ్ లో ఉండిపోవాలంటే ఎంత ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది? కొన్ని కోట్లలోనే ఉంటుంది కదా? కానీ.., ఈ విషయంలో అందరి అంచనాలు తప్పని నిరూపించాడు మహేంద్ర సింగ్ ధోని.
“వరల్డ్ కప్ లో టీమ్ కి మెంటర్ గా వ్యవహరించడం అనేది నా బాధ్యత. దాదా నా మీద పెట్టుకున్న నమ్మకం ఇది. నాకు ఇన్ని ఇచ్చిన దేశానికి సేవగా మాత్రమే ఈ అవకాశాన్ని భావిస్తున్నాను. మెంటర్ గా వ్యవహరిస్తున్నందుకు నాకు ఒక్క రూపాయి కూడా ఫీజుగా గా వద్దు” అని ధోని ముందుగానే బోర్డుకి తెలియచేశాడట.
బీసీసీఐ సెక్రటరీ జై షా తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. “ధోని ఓ మంచి ఫలితం కోసం.. తన బాధ్యతను నిర్వర్తించడానికి ముందుకి వచ్చాడు. ఇందుకోసం అతను డబ్బు ఛార్జ్ చేయడం లేదు” అని జై షా తెలియ చేశారు. దీంతో.. దేశం కోసం మహేంద్ర సింగ్ ధోని ఎంత కమిట్మెంట్ గా ఆలోచిస్తాడో అన్న విషయం మరోసారి ఋజువైంది. మరి.. ఈ విషయంలో ధోని తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.