SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Mithali Raj Says Looking To Finish Journey With World Cup Tilte

అదే నా కల.. దాని తరువాతే రిటైర్మెంట్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 3 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అదే నా కల.. దాని తరువాతే రిటైర్మెంట్!

క్రికెట్ అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ.. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ.. అది రెండో స్థానానికి పరిమితం. అంతలా క్రికెట్ ను ఆదరిస్తారు. క్రికెట్ ప్రయాణంలో ఎన్నో టోర్నీలు.. లెక్కలేనన్ని మ్యాచులు. ఇక పంచకప్‌ అంటే అందరి కల.. ఎన్ని మ్యాచులు గెలిచినా.. ఒక్కసారి ప్రపంచ కప్ టైటిల్ సొంతమైతే ఆ కిక్కేవేరు. ప్రతి దేశం ఈ టోర్నమెంట్ అద్భుతంగా రాణించాలనే చూస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశ మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఇది ఒక అందరి ద్రాక్షగా మిగిలిపోయింది. ఇంగ్లాండ్ వేదికగా 1973 నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో మొదటిసారి ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పటివరకు మహిళలు వన్డే ప్రపంచకప్ 11 సార్లు జరగ్గా.. 6 సార్లు ఆస్ట్రేలియా, 4 సార్లు ఇంగ్లాండ్, 1 సారి న్యూజిలాండ్ విజేతగా అవతరించాయి. చివసారిగా 2017 లో జరిగిన ఈ టోర్నీలో భారత మహిళల జట్టు రన్నరప్ గా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మిగిలిపోతున్న వరల్డ్ కప్ టైటిల్ ని ఈ సారి సొంతం చేసుకోవాలని చూస్తోంది.

ఐసీసీ మహిళ వన్డే ప్రపంచకప్‌-2022 సమరానికి రంగం సిద్దమైంది. న్యూజిలాండ్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. మౌంట్‌ మౌంగానుయ్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో అతిథ్య న్యూజిలాండ్‌ మహిళల జట్టు.. వెస్టిండీస్‌ మహిళల జట్టుతో తలపడనుంది. ఇక భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా మెగా టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తన మనసులోని మాటను బయట పెట్టింది.Mithaliraj“2000లో కూడా న్యూజిలాండ్‌లోనే జరిగిన ప్రపంచకప్‌లో ఆడాను. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చాను. “నా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రపంచకప్‌ టైటిల్‌తో ముగించాలని కోరుకుంటున్నా. మా జట్టు సభ్యులంతా బాగా రాణించి మా ప్రణాళికలన్నీ సఫలం చేయాలని ఆశిస్తున్నా.ప్రపంచకప్‌ గెలిస్తే మా ఆటగాళ్లందరికీ స్వదేశంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మమ్మల్ని చూసి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాం” అని మిథాలీ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఇక మిథాలీ రాజ్‌కు ఇది 6వ వన్డే వరల్డ్‌ కప్‌. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలవనుంది.

Captain Mithali Raj discusses India’s preparation, goals for #CWC22 and the desire to win their first ever ICC Women’s Cricket World Cup 🏆

— ICC (@ICC) March 1, 2022

భారత మహిళల జట్టు ఈ ఏడాది ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ లో అడుగు పెట్టింది. ఎనిమిది జట్ల టోర్నీలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్ కాకపోవచ్చేమో.. కానీ, మన జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీ అనడంలో సందేహం లేదు. గత ప్రపంచకప్ (2017) ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన భారత్.. ఈసారి మరింత పట్టుదలతో ఉంది. ఈ నెల 6న మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్థాన్ తో భారత జట్టు తలపడనుంది. చూడడానికి భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ రూపంలో స్టార్ ఓపెనర్లు భారత్ సొంతం. మంధాన గురుంచి ప్రస్తావిస్తే.. దూకుడుగా ఆడగలదు, అవసరమైతే సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి పెద్ద ఇన్నింగ్స్ ఆడగలదు. ఇక షెఫాలీ ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపు ఆరంభాన్నీ ఇవ్వగలదు. ఆమె సామర్థ్యం మేరకు రాణిస్తే భారత్ కు తిరుగుండదనడంలో సందేహం లేదు.Mithali Rajఇక భారత మహిళల క్రికెట్ లో సుదీర్ఘ కాలంగా రాణిస్తూ.. అనుభవజ్ఞురాలైన కెప్టెన్ మిథాలీ రాజ్ జట్టుకు వెన్నెముక. ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ లో మూడు అర్ధ సెంచరీలు సాధించిన మిథాలీ.. మునుపటి కంటే వేగంగా పరుగులు రాబట్టింది. మిడిల్ ఆర్డర్ లో హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి బ్యాటర్ ఉండడం భారత్ కు కలిసొచ్చేదే.. అయితే హర్మన్ ప్రీత్ ఫామ్ అందుకోవడం చాలా ముఖ్యం. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచులో సెంచరీతో రాణించింది హర్మన్ ప్రీత్. ఆఫ్ స్పిన్నర్ గా దీప్తి శర్మ, వికెట్ కీపర్ రీచా ఘోష్ కూడా మంచి బ్యాటింగ్ నైపుణ్యమున్న బ్యాటర్లే. ఈ బ్యాటింగ్ దళం సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్ లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.

1⃣ squad, 1⃣ mission & a billion dreams – united by #HamaraBlueBandhan, a special bond between #WomenInBlue & the fans!

Are you ready to join us & cheer for #TeamIndia in the ICC Women’s World Cup 2022?

ICC #CWC22 | #PAKvIND | Mar 6, 6:30 AM | Star Sports 2/2HD/3/Disney+Hotstar pic.twitter.com/3y9oqocMTy

— Star Sports (@StarSportsIndia) March 1, 2022

Tags :

  • Cricket News
  • India vs Pakistan
  • mithali raj
  • newzland
  • Team India
  • Women's World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

  • క్రీడా మంత్రి క్రికెట్‌కు వీడ్కోలు.. మినిస్టర్ ఆటకు రిటైర్మెంట్ ఏంటని అనుకుంటున్నారా?

    క్రీడా మంత్రి క్రికెట్‌కు వీడ్కోలు.. మినిస్టర్ ఆటకు రిటైర్మెంట్ ఏంటని అనుకుంటున్నారా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam