ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కి ముందు టీమిండియా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్‌పై ఆశలు పెంచుతోంది. కోహ్లీ కెప్టెన్‌గా, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా చివరి వరల్డ్ కప్ కావడంతో అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి. రైనాలాంటి వారుకూడా కప్పు కోసం కృషి చేయాలి.. కోహ్లీ కోసమైనా అంటూ చెప్పడం అంచనాలను పెంచేస్తున్నాయి. వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను భారీ తేడాతో గెలవడం కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేస్తోంది. టీమిండియా అభిమానులకు మరో శుభవార్త కూడా వినిపిస్తోంది. మెగా ఈవెంట్ మెయిన్ మ్యాచ్‌లకు ముందు మెంటర్ ధోనీ చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ పుకార్లు విన్నాం. అవే లేవు అన్నట్లు ధోనీ.. రోహిత్- కోహ్లీ కలిపేశాడు.
ఇదీ చదవండి: సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ల*జ కొడకా అంటారా? సీఎం జగన్ భావోద్వేగ పోస్ట్!
ఇందుకేనేమో బీసీసీఐ ధోనీని మెంటర్‌గా మార్చింది అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. పలు సందర్భాల్లో రోహిత్- కోహ్లీకి మధ్య చెడింది అనే వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో అవి నిజమేనేమో అని నమ్మేలాగే ఉన్నాయి. అలాంటి వాతావరణం టీమ్‌కు అంత మంచిది కాదు. కానీ, ధోనీ అలాంటి పరిస్థితులు ఏమీ లేవని నిరూపించాడు. వారిని ఇద్దరినీ కలిపేసి చూపించాడు. మైదానంలో ఇద్దరూ కలిసి వ్యూహాలు రచించడం. రెండో వార్మప్ మ్యాచ్‌లో రోహిత్‌ను కెప్టెన్‌గా చేయడం కూడా అందరినీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్‌గా వ్వవహరించడమే కాదు.. కోహ్లీ బౌలింగ్ చేశాడు.
ఇలాంటి అద్భుతాలు ధోనీ వల్లే సాధ్యం అని దాదాకి ముందే తెలుసు అనుకుంటా! అందుకే మెంటర్‌గా ధోనీని ఎంచుకున్నారు అంటున్నారు. ఇద్దరు దిగ్గజాలు ఇలా కలిసి పనిచేయడం కూడా టీమ్‌కు మంచి చేసే అంశమే. మెగా టోర్నీలో వార్మప్ మ్యాచ్‌లలో చేసిన ప్రదర్శనను మెగా ఈవెంట్‌లోనూ కంటిన్యూ చేస్తే కప్పు కొట్టడం అంత పెద్ద కష్టం ఏమీ కాదు. మరి ధోనీ వ్యూహాలు కోహ్లీ, రోహిత్ ప్రదర్శనలతో కప్పుకొడతారు అనే ఆశాభావంతోనే ఉన్నారు అభిమానులు. రోహిత్- కోహ్లీ కలిసిపోవడం టీమ్‌కు మంచి చేసే అంశమే అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
What do you reckon is the discussion between the think-tank? 🤔
Toss coming up shortly! 👍#TeamIndia #INDvAUS #T20WorldCup pic.twitter.com/CLUSyHP70M
— BCCI (@BCCI) October 20, 2021