శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా-2022లో భాగంగా బెంగళూరు వేదికగా రెండో టెస్టు కొనసాగుతోంది. రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో లీడ్ లో ఉంది. మొదటి టెస్టును మూడురోజుల్లోనే ముంగించిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో మాత్రం ఇండియా బ్యాటింగ్ లైనప్ ను శ్రీలంక బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు. అయితే అదంతా బౌలింగ్ గొప్ప తనమే కాదు.. పిచ్ మహిమ కూడా అంటున్నారు అభిమానులు. బెంగళూరు చినస్వామి స్టేడియంలో పిచ్ ను అంచనా వేయడం అంత సమాన్యం కాదు అనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.
ఇదీ చదవండి: బ్యాటింగ్ లో సచిన్ నే ఆశ్చర్యపరిచిన 5 ఏళ్ళ చిచ్చరపిడుగు!
రెండో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు. అయితే ప్రస్తుతం కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయిన తీరు మాత్రం సోషల్ మీడాయాలో బాగా వైరల్ అవుతోంది. అది కచ్చితంగా కోహ్లీ బ్యాడ్ లక్ మాత్రమే అంటున్నారు. టీ బ్రేక్ కు రెండు ఓవర్ల ముందు 28వ ఓవర్ ధనంజయ వేస్తున్నాడు. మొదటి బాల్ డాట్, రెండో బాల్ పంత్ సింగిల్ తీసి విరాట్ కోహ్లీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ధనంజయ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ ను కోహ్లీ బ్యాక్ ఫుట్ పై డిఫెండ్ చేయబోయాడు. కానీ, ఆ బాల్ ఎక్కువ బౌన్స్ కాకుండా కోహ్లీ యాంకిల్ కు కొద్దిగా పైన తగిలింది. అంపైర్ వెంటనే దానిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చేశాడు.
అది దాదాపుగా డెడ్ బాల్ కిందే పరిగణించాల్సింది అనే భావన ప్రేక్షకులు వ్యక్తపరిచారు. అక్కడ ఏం జరిగిందో అసలు ఆ పిచ్ ఎలా ప్రతిస్పందిస్తోందో.. కోహ్లీకి కూడా కాసేపు అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. రివ్యూకు వెళ్లలేదు అలా షాక్ లోనే కోహ్లీ పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఈ డిస్మిసల్ లో కేవలం అది కోహ్లీ దురదృష్టమే తప్ప మరేమీ లేదని క్రికెట్ అభిమానులు సమర్థిస్తున్నారు. క్రికెట్ పండితులు సైతం ఆ బాల్ ఆడటం అంత ఈజీ కాదంటూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Rishobpuant (@rishobpuant) March 12, 2022