ఇండియన్ ప్రీమియర్‌లీగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రక్షాళన దిశగా మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.
2016లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చాంపియన్‌గా నిలువలేకపోయింది. బెయిర్‌స్టో, రషీద్‌ఖాన్, వార్నర్, విలియమ్సన్ వంటి స్టార్ ప్లేయర్లను వదిలేసుకున్న తర్వాత.. ఎస్‌ఆర్‌హెచ్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఇటీవలి కాలంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం కాకుండా.. అట్టడుగు ప్లేస్ కోసం ఆరెంజ్ ఆర్మీ పోటీ పడుతోంది. దీంతో అభిమానులు కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం స్పందించడం గమనార్హం.
ఓ సినిమా ఫంక్షన్‌లో రజినీ మాట్లాడుతూ.. ఐపీఎల్ సందర్భంలో కావ్య బాధపడే సీన్ టీవీల్లో చూడలేకపోతున్నానని.. ప్రతిసారి ఛానల్ మార్చేయాల్సి వస్తోందని.. ఈ సారైనా మంచి ప్లేయర్లను ఎంపిక చేసుకోవాలని రజనీ సుచించారు.తాజా పరిణామాలు చూస్తుంటే.. సుపర్ స్టార్ వ్యాఖ్యలను కావ్య సీరియస్‌గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే హెడ్‌కోచ్ బ్రియాన్ లారాను తప్పించిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. కొత్త కోచ్ కోసం వేట ప్రారంభించింది. పలువురు సీనియర్ ప్లేయర్లు, కోచ్‌లను ఇప్పటికే సంప్రదించిన్నట్లు ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో టామ్ మూడీ, మైక్ హెస్సెన్, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే టామ్ మూడీ గతంలోనూ సన్‌రైజర్స్ కు కోచ్‌గా వ్యవహరించగా.. హెస్సెన్ ను రీసెంట్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసుకుంది. చాన్నాళ్లుగా ఆర్సీబీకి కోచ్‌గా వ్యవహరించిన మైక్.. సూపర్ స్టార్‌లు అందుబాటులో ఉన్నా.. బెంగళూరుకు ఒక్క ట్రోఫీ కూడా అందించలేకపోయాడు. దీంతో ఆ జట్టు హెస్సెన్‌ను తప్పించి అతడి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్, జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. అతడికి తోడు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ను మెంటార్‌గా నియమించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హెస్సెన్ వైపు మొగ్గు చూపకపోవచ్చు.
నాలుగేండ్ల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇక యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి వంటి వాళ్లకు విరివిగా అవకాశాలిస్తున్న ఆరెంజ్ ఆర్మీ.. విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్‌ను కోచ్‌గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై వీరేంద్రుడిని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంప్రదించిందని.. అతడి రియక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గానూ వీరేంద్ర సెహ్వాగ్ పోటీపడ్డ విషయం తెలిసిందే. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. పొట్టి ఫార్మాట్‌కు సెహ్వాగ్ వంటి ఫటా ఫట్ వ్యక్తే సరైనవాడని.. అతడినే కోచ్‌గా నియమించాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఎస్‌ఆర్‌హెచ్ కోచ్‌గా సెహ్వాగ్ నియమితుడవ్వాలని మీరూ కోరకుంటున్నారా! మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.
Kavya Maran 🫰🫰🫰🫰😍😍😍 https://t.co/KYsNj69p1K
— Old Monk (@mroldmonkk) August 6, 2023