ఆస్ట్రేలియా వేదికగా ఇటివల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, అశ్విన్, షమీలకు విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌కు పయనమైంది. నేడు(శుక్రవారం) విల్లింగ్టన్ వేదికగా స్కై స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉన్నా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయింది. అయితే.. ఇండియా-న్యూజిలాండ్ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ 2022లో సెమీస్ వరకు వెళ్లి వెనుదిరిగిన విషయం తెలిసిందే. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ పాక్ చేతిలో ఓడగా.. రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లండ్ చేతిలో ఓడింది.
దీంతో ఈ రెండు జట్ల మధ్య వెంటనే టీ20 సిరీస్ ప్రారంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన తర్వాత.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘భారత ఆటగాళ్లలో అద్భుతమైన టాలెంట్ ఉందని, ఐపీఎల్లో వారు చాలా బాగా ఆడతారు’ అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన యంగ్ ఇండియన్ టీమ్ గురించి మాట్లాడుతూ.. కేన్ మామ ఈ విధంగా స్పందించాడు. కాగా.. కేన్ మామ పాజిటివ్‌గానే చెప్పినా.. ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో పాక్‌పై ఆడిన తొలి మ్యాచ్ మినహా భారత జట్టు గొప్ప ప్రదర్శన ఏం చేయలేదు.
పటిష్టమైన సౌతాఫ్రికా జట్టుతో మ్యాచ్‌లో ఓడి.. నెదర్లాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి పసికూన జట్లపై ఓడి సెమీస్ చేరింది. సెమీస్‌లో బలమైన ఇంగ్లండ్ జట్టు తగిలితే గానీ భారత బౌలింగ్ సత్తా ఏంటో బయటపడలేదు. 169 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌కు ఇచ్చిన భారత్.. కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా మ్యాచ్ ఓడిపోయారు. దీంతో టీమిండియా ఆటగాళ్లపై ముఖ్యంగా బౌలర్లు, ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఐపీఎల్లో అయితే చించుకని ఆడే ఆటగాళ్లు ఇండియా తరఫున ఐసీసీ ఈవెంట్స్, వరల్డ్ కప్స్‌లో మాత్రం చేతులెత్తేస్తున్నారంటూ మండిపడ్డారు. కేఎల్ రాహుల్నైతే ఏకంగా మిస్టర్ ఐపీఎల్ అంటూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్లు ఐపీఎల్లో బాగా ఆడతారని కేన్ మామ పేర్కొనడం విశేషం.
Kane Williamson said “India has some incredible talent, everyone has been doing well in IPL”.
— Johns. (@CricCrazyJohns) November 18, 2022