SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Vs England Fifth Test England Batting Line Up Analysis In Telugu

Ind Vs Eng: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్‌.. కానీ, ఆ నలుగురితోనే సవాలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ind Vs Eng: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్‌.. కానీ, ఆ నలుగురితోనే సవాలు!

జులై 1న ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు నెగ్గి.. టీమిండియా చరిత్ర సృష్టించాలంటూ క్రికెట్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే.. 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ సారధ్యంలో ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా చివరిసారి టెస్టు సిరీస్‌ నెగ్గింది. ఆ తర్వాత 2011, 2014, 2018 సంవత్సరాల్లో అది కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పక్కాగా సిరీస్‌ నెగ్గుతామంటూ అంతా భావించారు. కానీ, ఆ సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి టెస్టు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా జరగబోయే ఐదో టెస్టును టీమిండియా విజయం సాధిచినా, డ్రాగా ముగించినా కూడా చరిత్ర సృష్టించినట్లౌతుంది.

కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ సాధించింది.. హెడ్‌ కోచ్‌గా సాధించగలడా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే వేచి చూడాల్సిందే. అయితే విజయం/డ్రా ఈ రెండూ టీమిండియాకు అంత సులువుగా అందే అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టులో బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జో రూట్‌, బెయిర్‌స్టో బీకర ఫామ్‌లో ఉన్నారు. జో రూట్‌ ప్రస్తుతం ఎంతో నిలకడగా, అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థులు ఎవరైనా అంత తేలిగ్గా వికెట్‌ ఇవ్వడంలేదు.. అలవోకగా శతకాలు బాదేస్తున్నాడు. అటు టీమిండియా మీద కూడా రూట్‌ చాలా మంచి రికార్డులు ఉన్నాయి. ఐదో టెస్టు జరగబోయే ఎడ్జ్‌ బాస్టన్‌ మైదానంలోనూ భారత్‌ తో ఆడిన రెండు ఇన్నింగ్సుల్లో 94 పరుగులు చేశాడు.

Look who’s here!

Head Coach Rahul Dravid has joined the Test squad in Leicester. 💪💪 #TeamIndia pic.twitter.com/O6UJVSgxQd

— BCCI (@BCCI) June 21, 2022

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఇటీవలే కెప్టెన్‌ గా తొలి సిరీస్‌ గెలిచిన ఆనందం, దూకుడు మీదున్నాడు. అంతేకాకుండా బెన్‌ స్టోక్స్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ మొత్తాన్ని మార్చేయగలడు. ఎడ్జ్‌ బాస్టన్‌ లో భారత్‌ తో ఆడిన టెస్టు మ్యాచ్‌ లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి స్టోక్స్‌ కొట్టింది 27 పరుగులు మాత్రమే. అలాగని భారత్‌ పై బెన్‌ స్టోక్స్‌ కు భారత్‌ పై సరైన రికార్డు లేదని కుదుటపడటానికి లేదు. అతను ఎప్పుడైనా అద్భుతాలు సృష్టించగలడు.

Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc

— BCCI (@BCCI) June 20, 2022

జోస్‌ బట్లర్‌, బెయిర్‌ స్టో కూడా చాలా ప్రమాదకర ప్లేయర్లు. బట్లర్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్టు, టీ20 అని తేడా లేకుండా బౌలర్లను ఎడాపెడా బాదేస్తున్నాడు. ఇటీవల నెదర్లాండ్స్‌ పై బట్లర్‌ కేవలం 70 బంతుల్లో 163 పరుగులు స్కోర్‌ చేయడం చూశాం. అటు ఐపీఎల్‌-2022 లోనూ రాజస్థాన్ రాయల్స్‌ తరఫున జోస్‌ బట్లర్‌ 863 పరుగులు చేసి ఆరంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. అటు బెయిర్‌స్టో కూడా ఎంతో ప్రమాదకర ఆటగాడు. టెస్టు మ్యాచ్‌ టీ20 తరహాలో ఆడతాడు. అలా ఆడటమే కాదు.. టీమ్‌ ను ముందుండి గెలిపిస్తాడు కూడా.

తాజాగా నాటింగ్‌ హామ్ వేదికగా న్యూజిలాండ్‌ పై 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి టెస్టు మ్యాచ్‌ ని గెలిపించాడు. 300 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ను 92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి విజయతీరాలకు చేర్చాడు. అలాంటి ప్రమాదకర ఆటగాళ్లు ఉన్న ఇంగ్లాండ్‌ జట్టును టీమిండియా ఓడించి సిరీస్‌ గెలవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. మరి.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఎలాంటి ప్రణాళికలు వేస్తాడో. ఇంగ్లాండ్‌ జట్టును ఎలా కట్టడి చేస్తాడో వేచి చూడాలి. ఇంగ్లాండ్‌ తో ఐదో టెస్టు గెలిసి టీమిండియా చరిత్ర సృష్టించగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Practice 🔛

Strength and Conditioning Coach, Soham Desai, takes us through Day 1⃣ of #TeamIndia‘s practice session in Leicester as we build up to the #ENGvIND Test. 💪 pic.twitter.com/qxm2f4aglX

— BCCI (@BCCI) June 21, 2022

  • ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లీకి కరోనా పాజిటివ్? షాక్‌ లో ఫ్యాన్స్‌!
  • ఇదీ చదవండి: క్రిస్‌ గేల్‌ ని కలిసిన విజయ్‌ మాల్యా.. ఫొటోలు వైరల్‌!

Tags :

  • BCCI
  • Cricket News
  • England
  • ind vs eng
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

    గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

  • ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

    ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

  • ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

    ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • 52 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డు ఎవరికీ తెలియని టీమ్ ఇండియా టాప్ బౌలర్

    52 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డు ఎవరికీ తెలియని టీమ్ ఇండియా టాప్ బౌలర్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఈ అలవాటు చాలా డేంజర్, ఈ వ్యాధులతో పాటు కేన్సర్ రావచ్చు

  • ఆ పని అస్సలు చేయను అది రజనీకాంత్ ఇచ్చిన సలహా

  • బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో జడ్జీల ఓవరాక్షన్, పక్షపాతం.. టాప్ 15 జాబితా ఇదే

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో మరో కన్నడ బ్యూటీ

  • రజనీకాంత్‌ను టాలీవుడ్ దర్శకుడు ఒప్పించాడా, ఏ కధ విన్పించాడు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam