టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కీపింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా అలాగే ది బెస్ట్ వికెట్ కీపర్‌గా ప్రపంచ క్రికెట్‌పై ధోని తన చెరగని ముద్ర వేశాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఏ వికెట్ కీపర్ అయినా ఒక అద్భుతమై క్యాచ్ పట్టినా.. లేదా కళ్లు చెదిరే రనౌట్‌చేసినా, మెరుపువేగంతో స్టంప్ అవుట్ చేసినా కూడా అరే అచ్చం ధోనిలానే చేశాడే అంటూ పోల్చుతారంటే ధోని గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది.
మిల్లీ సెకన్ల వ్యవధిలో క్యాచ్‌లు అందుకోవడం.. మెరుపువేగంతో స్టంప్ అవుట్ చేయడం.. వికెట్లను చూడకుండానే అందిన బంతిని ఆలస్యం చేకుండా వికెట్లకు విసిరి రనౌట్ చేయడం ఒక్క ధోనికే సాధ్యమైంది. ధోని తన కెరీర్‌లో టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 3 రనౌట్లు, 38 స్టంప్ అవుట్లు చేశాడు. వన్డేల్లో 321 క్యాచ్‌లు, 22 రనౌట్లు, 123 స్టంప్ అవుట్లు ఉన్నాయి. అలాగే టీ20ల్లో 57 క్యాచ్‌లు, 8 రనౌట్లు, 34 స్టంప్ అవుట్లు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో ధోని 135 క్యాచ్‌లు, 21 రనౌట్లు, 39 స్టంప్ అవుట్లు చేశాడు. ఇలా అనితర సాధ్యమైన రికార్డులు ఎన్నో ఖాతాలో ఉన్నాయి. తాజాగా ధోని తన కెరీర్‌లో చేసిన అద్భుతమైన రనౌట్లు, స్టంప్ అవుట్లను కొన్నింటిని కలిపి ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక రీల్‌ను పోస్టు చేసింది. ధోని టాలెంట్ గురించి ఇలాంటి వంద రీల్స్ అయినా తక్కువ అయినప్పుటికీ ఐసీసీ పోస్టు రీల్ ధోని ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రీల్ వైరల్‌గా మారింది. మరి ఈ రీల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.