ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. ఇన్నాళ్లు హార్దిక్ పాండ్యా అంటే మీకు కోపం ఉండొచ్చు.. సహచర ఆటగాళ్లపై అతడి చేసే చర్యలు నచ్చి ఉండకపోవచ్చు. ఇవన్నీ ఒక్క మాటతో గాలిలో కలిసిపోయాయి. జట్టులో తన స్తానం గురుంచి పాండ్యా ఎవరు ఊహించని కామెంట్స్ చేశాడు. జట్టు విజయాల్లో తన పాత్ర లేనప్పుడు.. జట్టులో స్థానం కూడా తాను కోరుకోనని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్కమాటతో హార్దిక్ పై నెటిజన్స్ ప్రసంశలు కురిపిస్తున్నారు. అసలు.. పాండ్యా ఈమాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా..? అది తెలియాలంటే కింద చదివేద్దాం పదండి..
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్ పోరులో ఇండియా పైచేయి సాధించిన సంగ తెలిసిందే. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ తో జరిగిన 4 మ్యాచుల టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకున్న భారత్, సిరీస్ సొంతం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. జూన్ 7న లండన్‌లోని ఒవల్ వేదికగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య తుది పోరు జరగాల్సి ఉంది. ఇదిలావుంటే.. ఈ మ్యాచులో ఎవరిని ఆడించాలన్న దానిపై అప్పుడే పెద్ద చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు ఎవరికి వారు తుది జట్టులో ఎవరు ఉండాలన్న దానిపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ మ్యాచులో తుది జట్టులో స్థానం గురుంచి పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జట్టులో సారథి రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ, పుజారా, షమీ, సిరాజ్ స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మిగిలిన స్థానాల కోసం పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఎవరు ఆడతారు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పేస్‌కి అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లు కావడంతో బౌలర్ల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. షమీ, ఉమేష్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్.. ఇలా బౌలర్లందరూ ఫామ్ లో ఉండటంతో ఎవరిని సెలెక్ట్ చేయాలన్నలన్నది సెలెక్టర్లకు సవాల్ గా మారింది. అదీకాక ఇప్పటికే ఒకసారి డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో కివీస్ చేతిలో ఓడి ఉండటం జట్టు ఎంపికకు మరింత తలనొప్పిగా తయారయ్యింది.
ICC Poster for WTC final with Rohit & Cummins. pic.twitter.com/ti6mjBZEGa
— Johns. (@CricCrazyJohns) March 15, 2023
బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, పంత్ గాయాల కారణంగా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్‌లోకి వచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న హార్దిక్‌కు డబ్ల్యూటీసీ జట్టులో స్థానం లేకపోలేదు. ఆల్ రౌండర్‌గా అతని సేవలను టెస్టులకి సైతం ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో పాండ్యని ఆడించే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. పేసర్లకు అనుకూలించే పిచ్ లపై హార్దిక్ జట్టులో ఉంటే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కి కూడా ఉపయోగపడతాడన్నది బీసీసీఐ ఆలోచన.
అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తాను డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడట్లేదని స్పష్టత ఇచ్చేసాడు హార్దిక్. దీనికి కారణం వింటే హార్దిక్‌ని మీరు అభినందించకుండా ఉండలేరు. ఏవేవో లెక్కలేసిన హార్దిక్..డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడానికి తనకు తానుగా అనర్హుడిగా చెప్పుకొని గొప్ప మనసుని చాటుకున్నాడు. “భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కి చేరుకోవడంలో నా శ్రమ 10 శాతం కూడా లేదు. ఇప్పుడు జట్టులోకి వచ్చి వేరేవారి స్థానంలో ఆడడం నేను సరైనదిగా భావించడం లేదు. బాగా కష్టపడి.. టెస్టుల్లో స్థానం సంపాదించటానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే కష్టపడే నేను జట్టులోకి వస్తాను. అప్పటివరకు డబ్ల్యూటీసీ ఫైనల్ గాని వేరే ఏ ఇతర టెస్టు సిరీస్ లు నేను ఆడేందుకు సిద్ధంగా లేను..” అని చెప్పుకొచ్చాడు. హార్దిక్ మాటలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#HardikPandya rules himself out of World Test Championship Final
India all-rounder said it would be “ethically not right” on his part to take up a spot in India’s possible #WorldTestChampionship squad.#WTCFinal #WTC2023 #INDvsAUS pic.twitter.com/NJFmLFCHNX
— Sunil Singh (@SunilSingh_0007) March 17, 2023