ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. ఇన్నాళ్లు హార్దిక్ పాండ్యా అంటే మీకు కోపం ఉండొచ్చు.. సహచర ఆటగాళ్లపై అతడి చేసే చర్యలు నచ్చి ఉండకపోవచ్చు. ఇవన్నీ ఒక్క మాటతో గాలిలో కలిసిపోయాయి. జట్టులో తన స్తానం గురుంచి పాండ్యా ఎవరు ఊహించని కామెంట్స్ చేశాడు. జట్టు విజయాల్లో తన పాత్ర లేనప్పుడు.. జట్టులో స్థానం కూడా తాను కోరుకోనని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్కమాటతో హార్దిక్ పై నెటిజన్స్ ప్రసంశలు కురిపిస్తున్నారు. అసలు.. పాండ్యా ఈమాట ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా..? అది తెలియాలంటే కింద చదివేద్దాం పదండి..
టీమిండియాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా..! అంటే అవుననే సమాధానమే విపిస్తోంది. అదే.. 'టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్'. బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి రెండు టెస్టుల్లో గెలిచిన భారత్, ఫైనల్ రేసులో ఉన్నట్లే కనిపించింది. కానీ, అనూహ్యంగా మూడో టెస్టులో ఓటమిపాలయ్యాక.. టీమిండియా ఫైనల్ కు చేరుతుందా..? లేదా..? సందేహాలు వ్యక్తమవుతున్నాయి.