హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కెరీర్ కు గుడ్ బై చెప్పేందుకు భజ్జీ చాలా సమయమే తీసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో గత స్మృతులను నెమరు వేసుకున్నాడు హర్భజన్ సింగ్. అప్పట్లో ప్రపంచకప్ కొట్టిన తర్వాత ఆ టీమ్ పరిస్థితిపై, జట్టులో తన స్థానంపై హర్భజన్ మనసులోని మాటలను బయటపెట్టాడు. తనను టీమ్ లో నుంచి పక్కన పెట్టిన తర్వాత అందుకు తగిన కారణాలను సైతం తెలియజేయలేదంటూ చెప్పుకొచ్చాడు. సమాధానాలు రావని తెలిసినప్పుడు అసలు అడగడం కూడా దండగ అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు.
367: Matches
3569: Runs
2: 100s
6845.1: Overs
959: Maidens
711: Wickers
8/84: BBI
15/217: BBM
28: Fifers
5: 10-fers
🏆: T20 World Cup 2007
🏆: ODI World Cup 2011
☝️☝️☝️: First Indian to take a Test hat-trickThank you @harbhajan_sing for your memories pic.twitter.com/b0GfF5pIf5
— KG Sports (@TheKGSports) December 24, 2021
‘నేను కొన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించాను. సమాధానాలు రావని తెలిసినప్పుడు నన్ను ఎందుకు పక్కన పెట్టారు. నాతో అలా ఎందుకు ప్రవర్తించారు అంటూ ప్రశ్నించడం అనవసరం అని అర్థమైంది. అలాంటప్పుడు వాటిని ప్రస్తావించకుండా ఉండటమే మంచిదని భావించాను. వాటి గురించి ఆలోచించడం కూడా మానేశాను. అదే మంచిది కూడా’ అంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు.
#harbhajansing
Thank you #harbhajansingh pic.twitter.com/MopqKFeuow— Nabneet Nishant (@NishantNabneet) December 24, 2021
30ల్లో తనకు అవకాశాలు దక్కకపోవడంపై కూడా హర్భజన్ స్పందించాడు. ‘మేము ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. అదే జట్టు మళ్లీ ఎప్పుడూ కలిసి ఆడలేదు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా కలిసి ఆడకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. నేను 400 వికెట్లు సాధించినప్పుడు నా వయసు 31. ఆ తర్వాత 8- 9 సంవత్సరాల్లో నేను కనీసం 100 వికెట్లు సాధించగలిగే వాడినని నాకు అనిపించింది. కానీ, ఆ తర్వాత నేను సెలక్ట్ కాలేదు.. నేను మ్యాచ్ లు ఆడలేదు. 400 వికెట్లు తీసిన ఒక ప్లేయర్ ను ఒక్కసారిగా పక్కన పెట్టడం.. అందుకు కారణాలు కూడా చెప్పక పోవడం ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. నిజంగా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని ఇప్పటికీ ఉంది. మరి.. హర్భజన్ ను టార్గెట్ చేసి టీమ్ నుంచి తప్పించారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This Sing will always be the King👑
Happy retirement Pajii. Thank you for all the memories 💙 @harbhajan_singh#harbhajansingh pic.twitter.com/cmkUtiv7d5— Srikrishna Parya (@imSparya) December 24, 2021