భారత క్రీడారంగంలో మరో విషాదం చోటు చేసుకుంది.. భారత మాజీ కబడ్డీ ప్లేయర్ ఉదయ్ చౌటా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు మెడాల్లో నరాలు చిట్టిపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ కన్నముశారు.
ఇంటర్-కాలేజ్ కబడ్డీ టోర్నమెంట్లలో ఫిలోమినా కాలేజీకి ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించిన ఉదయ్ ఇంటర్-యూనివర్శిటీ కబడ్డీ టోర్నమెంట్లలో మంగళూరు యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఎన్నో అవార్డులు.. రివార్డులు గెల్చుకున్నారు. గతంలో ఆయనకు కర్ణాటక గవర్నమెంట్ ఏకలవ్య అవార్డు ఇచ్చింది.
2000 నుండి 2008 వరకు భారత కబడ్డీ జట్టులో సభ్యుడు. 2004లో, భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ కబడ్డీ మ్యాచ్లో ఉదయ్ ఐదు బంగారు పతకాలు సాధించాడు. 2007 కబడ్డీ ప్రపంచకప్లో భారత్ 29-19తో ఇరాన్ను ఓడించింది. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. దక్షిణ కన్నడలో ఎందరో యువ క్రీడాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Lucknow: 10 రోజులుగా తల్లి మృతదేహంతోనే కూతురు.. అక్కడ సీన్ చూసి పోలీసులు షాక్!
