గత కొంత కాలంగా టీమిండియా జట్టు ప్రదర్శనపై ఇంటా.. బయట విమర్శలు వస్తున్నాయి. జట్టు కూర్పు బాలేదని, టీమ్ లో మార్పులు చేయాలని, అలాగే టీమిండియా సెలెక్షన్ కమిటీని కూడా మార్చాలని డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే గతంలో సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ సారథ్యంలోని కమిటీని తొలగించింది బీసీసీఐ. ఇక వారి స్థానంలో కొత్త సెలెక్షన్ కమిటీ కోసం నవంబర్ 18, 2022న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దాంతో ఈ నోటిఫికేషన్ కు దాదాపుగా 600 అప్లికేషన్లు వచ్చాయి. సెలక్షన్ కమిటీలో ఛైర్మన్ పదవితోపాటుగా మరో నాలుగు పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన కమిటీ తాజాగా ఛైర్మన్ ను ప్రకటించింది.
టీమిండియా నూతన సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. ఛైర్మన్ తో పాటు మరో నాలుగు పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 600 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే క్రికెట్ అడ్వైజరీ కమిటి సభ్యులు అయిన సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్ర, జతిన్ పరంజపే లతో కూడిన కమిటీ ఈ అప్లికేషన్లను పరిశీలించింది. అందులోంచి 11 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. వారికి ఇంటర్య్వూలను నిర్వహించి అందులోంచి ఐదుగురిని సెలెక్షన్ కమిటీకి ఎంపిక చేసింది. వారిలో మాజీ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ కూడా ఉండటం గమనార్హం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తాజాగా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా చేతన్ శర్మానే నియమించింది ఈ క్రికెట్ అడ్వైజరీ కమిటీ. టీమిండియా నూతన సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్ గా మరోసారి ఎన్నికైయ్యారు చేతన్ శర్మ. అతడితో పాటుగా సభ్యులుగా శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జి, సలీల్ అంకోలా, శ్రీథరన్ శరత్ లు ఎన్నుకోబడ్డారు.
NEWS 🚨- BCCI announces All-India Senior Men Selection Committee appointments.
Mr Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee.
More details 👇👇https://t.co/K5EUPk454Y
— BCCI (@BCCI) January 7, 2023
National selection committee of Indian team:
Chetan Sharma, Shiv Sundar Das, Subroto Banerjee, Salil Ankola, Sridharan Sharath
— Johns. (@CricCrazyJohns) January 7, 2023