వెస్టిండీస్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాదీ బ్యాటర్ మిథాలీ రాజ్ నాయకత్వంలో మొత్తం 15 మంది సభ్యులను ఎంపిక చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్ల లిస్ట్లో ఉన్నారు. మార్చి 4న మౌంట్ మాంగనూయ్ వేదికగా మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్ ఏప్రిల్ 3న క్రిస్ట్ చర్చ్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో మౌంట్ మాంగనూయ్ మైదానంలో ఆడనుంది. ఆ తరువాత మార్చి 12న వెస్టిండీస్‌తో , 16న ఇంగ్లాండ్‌తో, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, 27న సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. కాగా భారత్ ఈ సారి హాట్ ఫేవరేట్‌గా టైటిల్ బరిలో దిగనుంది. కాగా ఇదే జట్టు న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 11 నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.
భారత జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలి వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ , రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
స్టాండ్బై: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్
🚨 NEWS 🚨: India Women’s squad for ICC Women’s World Cup 2022 and New Zealand series announced. #TeamIndia #CWC22 #NZvIND
More Details 🔽https://t.co/qdI6A8NBSH pic.twitter.com/rOZ8X7yRbV
— BCCI Women (@BCCIWomen) January 6, 2022