SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Austral Asia Cup 1986 Final India Vs Pakistan Still I Cant Sleep Remembering That Defeat Kapil Dev

ఆఖరి బాల్, ఆఖరి వికెట్, పాక్ గెలవాలంటే 4 పరుగులు..1986 ఫైనల్ పై నోరు విప్పిన ‘కపిల్ దేవ్’

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 25 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆఖరి బాల్, ఆఖరి వికెట్, పాక్ గెలవాలంటే 4 పరుగులు..1986 ఫైనల్ పై నోరు విప్పిన ‘కపిల్ దేవ్’

ఆసియా కప్ 2022 సమరానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 27 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, ఆ మరుసటి రోజే దాయాదుల పోరు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీ, పాక్ చేతుల్లో పరాజయం తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో దీనికి భారీ హైప్ వచ్చేసింది. ఒకరికి ఈ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకునేందుకు దొరికిన అవకాశం అయితే, మరొకరికి పరువు కాపాడుకునేందుకు మిగిలిన మార్గం. ఈ తరుణంలో 90ల్లో భారత్, పాకిస్తాన్ పోరు ఎలా ఉండేది? ఓడితే ఎలాంటి పరిస్థితులంటాయి అన్న విషయాలపై టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.

ఆసియా కప్ టోర్నీ, ఇప్పటివరకు 14 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. ఇందులో భారత జట్టు 13 సార్లే పాల్గొంది. మిగిలిన ఆ ఒక్క ఎడిషన్.. 1986 ఎడిషన్ లో టీమిండియా పాల్గొనలేదు. 1985లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ వివాదాస్పదంగా ముగిసింది. ఈ కారణంగా శ్రీలంక వేదికగా జరిగిన 1986 ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు పాల్గొనలేదు. దీంతో.. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే 1986 ఆసియా కప్ లో తలపడ్డాయి. అయితే, అంతకుముందు షార్జా క్రికెట్ అసోసియేషన్, ఐసీసీ ఆధ్వర్యంలో ఆస్ట్రల్-ఆసియా కప్ టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్ కు చేరి.. ఆఖరి బంతికి పాక్ చేతిలో పరాభవం పాలైంది. ఆరోజు ఏం జరిగింది? ఓటమికి కారణాలేంటి? అన్న విషయాలను మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆలాగే.. తన జీవితంలో ఏదైనా నిద్రలేని రాత్రి ఉందా! అంటే.. అదే ఆరోజే అని చెప్పుకొచ్చారు.

austral-asia-cup-1986-final-india-vs-pakistan-still-i-cant-sleep-remembering-that-defeat-kapil-dev (2)

Join Our Whatsapp Channel

1986లో ప్రారంభమైన తొలి ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు పాల్గొన్నాయి. తొలి రౌండ్‌లో న్యూజిలాండ్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. మరోవైపు.. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని చిత్తుగా ఓడించి ఫైనల్ చేరింది. ఇక.. భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. అనంతరం.. 246 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్‌ 49 ఓవర్లలో 235 పరుగులు చేసింది. పాకిస్తాన్ విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. వసీం అక్రమ్, జావేద్ మియాందాద్ క్రీజులో ఉన్నారు. ఛేతన్ శర్మకు బాల్ అందించాడు కపిల్ దేవ్.

తొలి బంతికి వసీం అక్రమ్ రనౌట్ కాగా, రెండో బంతికి బౌండరీ బాదాడు మియాందాద్. ఇక, మూడో బంతికి సింగిల్. నాలుగో బంతికి జుల్దార్‌నైన్‌ క్లీన్ బౌల్డ్. దీంతో ఆఖరి 2 బంతుల్లో 5 పరుగులు కావాలి. ఐదో బంతికి తాసీఫ్ అహ్మద్ కొట్టిన షాట్‌ని అందుకున్న అజారుద్దీన్ రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ చేశాడు. సింగిల్ వచ్చింది. ఆఖరి బంతికి 4 పరుగులు కావాలి.. స్ట్రైక్ లో మియాందాద్. నాలుగు నిమిషాల డిస్కషన్. ఫైనల్ గా యార్కర్ వేయాల్సిందిగా ఛేతన్‌ శర్మకు సూచనలు. అందరిలోనూ ఒకటే టెన్షన్. అలా యార్కర్ వేయబోయిన ఛేతన్‌ శర్మ లో ఫుల్ టాస్ వేస్తాడు. మియందాద్ దాన్ని కరెక్ట్‌గా మిడిల్ చేసి స్టాండ్స్ లోకి పంపుతాడు. పాకిస్తాన్ విజయం. “ఇప్పటికీ ఆ మ్యాచ్‌ని గుర్తు చేసుకుంటే నాకు ఏదోలా ఉంటుంది. ఆ ఒక్క బాల్ మా ఆత్మవిశ్వాసాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. ఆ పరాభవం నుంచి కోలుకోవడానికి మాకు నాలుగేళ్లు పట్టింది..’ అని చెప్పుకొచ్చాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.

‘Kapil still remembers crushing loss of 1986 , Miandad famous six on the last ball of the over . “Even if I remember that today, I can’t sleep’: Kapil Dev on 1986 loss to PAK https://t.co/eClqlkgyRX
via @@HTSportsNews

— Anxious heart دل مضطر (@AamirRizwan2017) August 24, 2022

ఇక,1984 నుంచి ఇప్పటి వరకు ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు 14 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 8 సార్లు గెలుపొందగా, పాకిస్థాన్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 1997లో వర్షం కారణంగా ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఇప్పుడు మరోసారి భారత జట్టు టైటిల్ ఫేవరైట్ గా బరిలోకి దిగుతోంది. 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో న్నీ జట్లు బలంగానే కనిపిస్తున్నప్పటికీ, భారత్, పాకిస్తాన్.. ఈ రెండింటిలోనే కప్ సొంతం చేసుకునే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. భారత్, పాకిస్తాన్.. పోరులో ఎవరు గెలుస్తారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: IND vs PAK: ‘రోజుకు 100-150 సిక్సర్లు కొడతా..’ భారత్‌కు పాకిస్థాన్ హిట్టర్ అసిఫ్ అలీ వార్నింగ్!
  • ఇదీ చదవండి: India vs Pakistan in Asia Cup: ఆసియా కప్‌‌ టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుల లెక్కలు ఇవే!

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Kapil Dev
  • Wasim Akram
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam