SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Asia Cup 2022 Hip And Fire Is Missing In India Vs Pakistan Match

Asia Cup 2022: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్! దాయాదుల పోరు ముందు ఇంత సైలెన్స్ దేనికి?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్! దాయాదుల పోరు ముందు ఇంత సైలెన్స్ దేనికి?

యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్రికెట్‌ సాకర్‌ సంగ్రామం, అదేనండి.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వచ్చేసింది. ఆసియా కప్‌లో భాగంగా రేపు(ఆదివారం, ఆగస్ట్‌ 28) దాయాదుల పోరు జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. టిక్కెట్లన్ని హాట్‌ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ మెగా మ్యాచ్‌కు యూఏఈ కూడా ముస్తాబైంది. కానీ.. ఏదో తెలియని వెలితి ఉన్నట్లు క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే అదో మినీ యుద్ధం. తుపాకులు, కత్తులు లేకుండా దేశం మొత్తం తరఫున 11 మంది ఆటగాళ్లు పాల్గొనే సంగ్రామం. పేరుకు క్రికెట్‌ మ్యాచే అయినా.. అది భావోద్వేగాలతో కూడిన రక్తం చిందని యుద్ధం. ఇరు దేశాల అభిమానులకు మిగతా దేశాలతో మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఒక ఎత్తు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ అంటేనే క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. క్రికెట్‌ ఫీవర్‌తో ఎక్కడ చూసిన మ్యాచ్‌పైనే చర్చ. అలాగే ఇరు దేశాల ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు కొన్ని నెలల ముందు నుంచే సవాళ్లు, ప్రతి సవాళ్లతో మరింత వేడిని పెంచేస్తుంటారు. కానీ.. ఆసియా కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు ఇది మిస్‌ అవుతున్నట్లు కనిపిస్తుంది.

గతంలో భారత్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే చాలు.. పాక్‌ ఆటగాళ్లు నోరేసుకుని పడిపోయేవారు. టీమిండియా బౌలర్లను చితక్కొడతాం అంటూ బ్యాటర్లు, బ్యాటింగ్‌ను కుప్పకూలుస్తామంటూ బౌలర్లు మ్యాచ్‌కు ముందు వార్నింగ్‌లు పాస్‌ చేసేవారు. ‘సచిన్‌ను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేస్తా.. టీమిండియా టాపార్డర్‌ను వణికిస్తా’ అంటూ అప్పట్లో షోయబ్‌ అక్తర్‌ హెచ్చరించేవాడు. అలాగే పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ కూడా మ్యాచ్‌కు ముందు తీవ్ర వ్యాఖ్యలు చేసేవాడు. ఈ వార్నింగ్‌లకు కొన్నిసార్లు టీమిండియా ఆటగాళ్లు కౌంటర్‌ ఇచ్చేనా, మరికొన్ని సార్లు మ్యాచ్‌లో ఆటతోనే గట్టి జవాబు చెప్పేవారు. ఒక మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూలుస్తానని అక్తర్‌ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సచిన్‌.. మ్యాచ్‌ తొలి ఓవర్‌లోనే అక్తర్‌ను పిచ్చికొట్టుడు కొడతాడు. దాంతో అక్తర్‌ను పవర్‌ప్లే బౌలింగ్‌ ఎటాక్‌ నుంచి తప్పిస్తారు. ఇలా గతంలో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఎక్కడ లేని హైప్‌, క్రేజ్‌ ఉండేది. ఎక్కడ చూసిన మ్యాచ్‌ గురించే చర్చ. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు కూడా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌.. ‘టీమిండియాను చిత్తుగా ఓడించి చరిత్రను తిరగరాస్తాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశాడు.

కానీ.. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడంలేదు. ఇరు దేశాల ఆటగాళ్లు ఒకరి పట్ల ఒకరు ఎంతో స్నేహభావంతో మెలుగుతున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్ల ఊసేలేదు. పైగా టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని, అందుకోసం ప్రార్థనలు కూడా చేస్తున్నట్లు పాక్‌ ఆటగాళ్లు ప్రకటించి.. కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్‌ లాంటి మాజీ క్రికెటర్లు సైతం ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను కేవలం మ్యాచ్‌లానే చూడాలని చెప్పడంతో.. గతంలో ఉండే ఆ ఫైర్‌ మిస్‌ అయినట్లు కనిపిస్తుంది. మైదానంలో ప్రత్యర్థుల్లా తలపడినా బయట అన్నదమ్ముల్లా ఉంటామని సెహ్వాగ్‌ పేర్కొనడంతో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను కూడా మిగతా సాధారణ మ్యాచుల్లా భావించాలని చెబుతున్నట్లు ఉంది. గతంలో ఉండే హైప్‌, క్రేజ్‌ వల్ల ఆటగాళ్లపై విపరీతమైన ఒత్తిడి ఉండేది. అలాగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఆటగాళ్ల ఇళ్లపై భౌతిక దాడులు కూడా జరిగేవి.

Join Our Whatsapp Channel

అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే అనవసరమైన వ్యాఖ్యలతో భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా.. పరస్పరం స్నేహభావంతో మెలుగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రాక్టీస్‌ సమయంలో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం.. యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు.. ఫామ్‌లో లేని ప్రత్యర్థి ఆటగాడు బాగా ఆడి ఫామ్‌లోకి రావాలని కోరుకోవడంతో.. ఇరు దేశాల క్రికెట్‌ అభిమానుల్లో కూడా భావోద్వేగాలను తగ్గించి, మ్యాచ్‌ను స్పోర్టివ్‌గా తీసుకునేలా చైతన్యపరుస్తున్నట్లు ఉన్నారు. నిజానికి ఆటను ఆటలా చూడాల్సిందే. మ్యాచ్‌లో గెలుపోటములు సహజం. అంతే కానీ.. గెలిస్తే నెత్తిన పెట్టుకుని, ఓడితే దూషణకు, ద్వేషానికి, దాడులకు దిగడం సరైంది కాదు. ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై అభిమానుల్లో తారాస్థాయిలో క్రేజ్‌ ఉన్నా.. ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మాత్రం గతంలోలా వైరం మాత్రం లేదని అర్థం అవుతుంది. ఇది ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలకు మంచి చేసేదే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పరామర్శించేందుకు వచ్చిన కోహ్లీ మనసు గెలుచుకున్న షాహీన్‌ అఫ్రిదీ!

Out of context IND vs Pak pic.twitter.com/sKHiSsRzlR

— Out Of Context Cricket (@GemsOfCricket) August 26, 2022

‘We want to see you back in form’ ♥️#AsiaCup #ViratKohli #INDvsPAK pic.twitter.com/gwSBnH4I0Q

— Wisden India (@WisdenIndia) August 26, 2022

Missing that old banters and heat moments between players #INDvPAK #Indvspak #AsiaCup2022 #ViratKohli #BabarAzam #CricketTwitter dubai pic.twitter.com/AsKlVh9fRU

— Divyansh khanna (@meme_lord2663) August 26, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • India vs Pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam