SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Andre Russell Smashed 103 Meter Six Out Of The Stadium In Big Bash League

వీడియో: బిగ్‌ బాష్‌లో రస్సెల్‌ విధ్వంసం! 6 సిక్సులతో హాఫ్‌ సెంచరీ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 21 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బిగ్‌ బాష్‌లో రస్సెల్‌ విధ్వంసం! 6 సిక్సులతో హాఫ్‌ సెంచరీ

వీరబాదుడికి పెట్టింది పేరైన కరేబియన్‌ వీరుడు రస్సెల్‌ మరోసారి తన పవరేంటో చూపించాడు. బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేట్స్‌ తరఫున ఆడుతున్న రస్సెల్‌.. తన పవర్‌ హిట్టింగ్‌తో దుమ్ములేపాడు. బుధవారం బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన రస్సెల్‌.. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రెనెగేట్స్‌ను ఆదుకున్నాడు. 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రస్సెల్‌ 42 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు చేసి విజయానికి కొద్ది దూరంలో అవుట్‌ అయ్యాడు. రస్సెల్‌ ఇన్నింగ్స్‌తోనే రెనెగేట్స్‌ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు బాదిన రస్సెల్‌.. అందులో 103 మీటర్ల ఒక సిక్స్‌ అయితే ఏకంగా స్టేడియం బయటికి వెళ్లి పడింది. ప్రస్తుతం రస్సెల్‌ కొట్టిన ఆ సిక్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బెన్‌ హీట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రెనెగేట్స్‌ బౌలర్లు చెలరేగడంతో బ్రిస్బెన్‌ హీట్‌ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. టామ్‌ రోజర్స్‌ 4, హుస్సేన్‌ 3 వికెట్లతో బ్రిస్బేన్‌ బ్యాటర్లను వణికించారు. బ్రిస్బెన్‌ బ్యాటర్లలో జిమ్మి పీర్సన్‌ 30 బంతుల్లో 45 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్‌ అయినా చేయగలిగింది. అయితే 138 పరుగుల నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రెనెగేట్స్‌ను సైతం బ్రిస్బెన్‌ బౌలర్లు వణికించారు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే రెనెగేట్స్‌ ఓపెనర్‌ సామ్‌ హార్‌పర్‌ను అవుట్‌ చేసిన నెసర్‌.. రెనెగేట్స్‌కు ఊహించని షాకిచ్చాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి మరో వికెట్‌ తీసి.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.

తన రెండో ఓవర్‌గా ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన నెసర్‌.. తొలి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టి.. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసినందుకు హ్యాట్రిక్‌ సాధించాడు. దీంతో రెనెగేట్స్‌ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన రస్సెల్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బ్రిస్బెన్‌ బౌలర్లపై విరుచుకుపడి 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని.. రెనెగేట్స్‌ను విజయ దిశగా నిడిపించాడు. 42 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు చేసిన రస్సెల్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత హుస్సేన్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేయడంతో.. రెనెగేట్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో రస్సెల్‌ పవర్‌ హిట్టింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Dre Russ has hit it out of the ground…literally 🤯#BBL12 #GETONRED pic.twitter.com/jMO6VWzLDg

— Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022

Tags :

  • Andre Russell
  • Big Bash League
  • Cricket News
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam