సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ షోలో భాగంగా ఓ యువకుడు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మోదీ దగ్గరికి దూసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
నేషనల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ పాల్గొన్న రోడ్ షోలో భద్రతా లోపం తలెత్తడం సంచలనం రేపింది. భద్రతా సిబ్బందిని దాటుకుని ఓ యువకుడు సరాసరి మోదీ దగ్గరికి పూల దండతో దూసుకొచ్చాడు. అక్కడే ఉన్న సిబ్బంది అతడిని పక్కకు తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కర్ణాటకకు వచ్చారు మోదీ. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం హుబ్లీలో రోడు షో నిర్వహించారు ప్రధాని మోదీ. దీంట్లో భాగంగా కాన్వాయ్ బయటకి వచ్చిన మోదీ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఇంతలోనే ఉన్నట్లుండి.. ఓ యువకుడు మెరుపు వేగంతో భద్రతా సిబ్బందిని దాటుకుని పూల దండతో మోదీ దగ్గరికి దూసుకొచ్చాడు.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
— ANI (@ANI) January 12, 2023
ఈ క్రమంలోనే అతడిని సెక్యూరిటీ అడ్డగించగా.. మోదీ పిలిచి మరి ఆ యువకుడి దగ్గరి పూల దండను తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సంచలనం రేపిన ఈ ఘటనపై స్థానిక పోలీసులు వివరణ ఇచ్చారు. మోడీ వచ్చే ముందే అక్కడ పరిసరాలను అంతా పరిశీలించి, భద్రతను కట్టుదిట్టం చేశాం. అదీకాక ఆ రోడ్ మెుత్తాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) తమ ఆధీనంలోకి తీసుకుంది అని పోలీసులు తెలిపారు. ఇందులో భద్రతా లోపంలేదని ప్రధాని మోదీయే స్వయంగా ఆ యువకుడు ఇచ్చిన పూల దండను తీసుకున్నాడు అని పోలీసులు పేర్కొన్నారు. ఇక 5 రోజులు జరగనున్న ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి 30 వేల మంది హాజరుఅవుతారని అంచనా. ఈ వేదికపై మోదీ కూడా ప్రసంగించనున్నారు.
Hubballi, Karnataka | We’re inquiring if he (the boy) was a local & had jumped out of enthusiasm. He was stopped by security personnel immediately. Interrogation on. Prima facie, it doesn’t seem like a breach of security: CP Raman Gupta on PM Modi’s roadshow security breach pic.twitter.com/XUueReP1x7
— ANI (@ANI) January 12, 2023