బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి విచారణ ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు పెట్టడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఉషా బాయి సింగ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె. శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజాసింగ్ తరపు లాయర్ రామచంద్రరావు, ప్రభుత్వ తరపు న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని జడ్జిల ముందు తమ వాదనలు వినిపించారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి ఆయనని 12 నెలల పాటు నిర్బంధం విధిస్తూ తెలంగాణ సర్కార్ ఈ నెల 19న జీవో జారీ చేసిన విషయాన్ని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలిపింది.
పీడీ యాక్ట్ సలహా మండలి కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేసింది. టీవీ, సోషల్ మీడియా వేదికగా కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన మాట్లాడిన ప్రసంగాలను పరిగణలోకి తీసుకుని పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. అయితే రాజాసింగ్ పై ఉద్దేశపూర్వకంగా పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారని, చట్టవిరుద్ధ చర్య అంటూ రాజాసింగ్ తరపు లాయర్ రామచంద్రరావు వాదించారు. దీనిపై విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది హైకోర్టు. ఒకవేళ 12 నెలల పాటు రాజాసింగ్ ను నిర్బధించాలన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోకు సానుకూలంగా తీర్పు వస్తే.. ఏడాది పాటు రాజాసింగ్ జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
హైదరాబాద్ లో శిల్పకళావేదికలో జరిగిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోకి వ్యతిరేకంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, అలానే మహ్మద్ ప్రవక్తపై సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జనాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగస్ట్ 25న ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రాజాసింగ్ చర్లపల్లి జైల్లోనే ఉంటున్నారు. అయితే ఆయనపై పెట్టిన పీడీ యాక్ట్ కేసును సవాల్ చేస్తూ అక్టోబర్ 20న రాజాసింగ్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరుగగా.. తదుపరి విచారణ ఈ నెల అక్టోబర్ 31కి వాయిదా వేసింది. రెండు రోజుల్లో రాజాసింగ్ కేసుపై క్లారిటీ రానుంది. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని అటు రాజాసింగ్ వర్గం, ఇటు కేసీఆర్ వర్గం ఆతురతగా ఎదురుచూస్తుంది.
రాజా సింగ్ కేసు మలుపు
Bjp mla raja singh case mondayhttps://t.co/RNooEAUmjd#JournalistSai #JournalistSaiNews #TheTruth— Journalist Sai (@saisatya14) October 28, 2022