తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ సినిమాని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడంతో నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు నిశ్శబ్దంగా ఉంటూనే వచ్చాయి. ఎప్పుడైతే ఈటల ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో అప్పటి నుండి పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకవైపు హుజురాబాద్ ఉపఎన్నిక హీట్ పుట్టిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాల ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ అధికార పార్టీని కాస్త కలవర పెడుతున్నాయి.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం తెలంగాణలో ఆ పార్టీకి కలసి వస్తోంది. మరోవైపు తెలంగాణలో కూడా చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రాక.. మళ్ళీ నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పుడు గాంధీభవన్ వైభవం చూస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలకి కిక్ రావడం ఖాయం. ఇలా ఎవరి వ్యూహాలతో వాళ్ళు బిజీగా ఉంటే షర్మిల మాత్రం ఖాళీగా ఎందుకు ఉంటుంది? ఇందుకే ఆమె తమకి అచొచ్చిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకిదింపిందా అంటే అవుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎవ్వరూ మరచిపోలేరు. జగన్ విజయంలో పీకే దే మెయిన్ రోల్. ఆ సమయంలో పీకే టీమ్ లోటస్ పాండ్ నుండే వైసీపీ కోసం పని చేశారు. ఇప్పుడు అదే కార్యాలయంలో పీకే దర్శనం ఇవ్వడంతో.. షర్మిల కూడా తన అన్నయ్యలా పీకే నే నమ్ముకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.., పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ ఓటమి తరువాత.. ఇకపై తాను వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిషోర్ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులు ప్రియా అనే పీకే శిష్యురాలు షర్మిల పార్టీకి దిశా, నిర్దేశం చేస్తూ వచ్చింది. కానీ.., ఇప్పుడు షర్మిల హైదరాబాద్ లో లేని సమయంలో ఏకంగా పీకే నే లోటస్ పాండ్ లో దర్శనం ఇవ్వడంతో రాజకీయ చర్చ నడుస్తోంది. ఒకవేళ షర్మిల పార్టీకి గైడెన్స్ ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ నిజంగానే రంగంలోకి దిగితే.. తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మరింత క్లిష్టం అయినట్టే చెప్పుకోవచ్చు. మరి.. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.