మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే లక్షల్లో అప్పులు చేసిందని ఇలా తక్కువ సమయంలోనే జగన్ ప్రభుత్వం విఫలమవుతుందని నేను అనుకోలేదంటూ ఆయన అన్నారు. ఇక ఇదే కాకుండా ఇటీవల చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ కూడా స్పందించారు.
ఎన్టీఆర్ కుమార్తెల గురించి తానెప్పుడు కూడా ఇలాంటి పుకార్లు వినలేదని అన్నారు. అయితే చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని అయితే నేను అనుకోవడం లేదని, ఆ విషయం ఆయనకు కూడా తెలుసన్నారు. మరో విషయం ఏంటంటే..? చంద్రబాబు కన్నీటిని డ్రామా అని కూడా అనలేమని కూడా ఉండవల్లి అన్నారు.
ఇదే కాకుండా మానసికంగా దిబ్బతిన్న వైసీపీ నేతలే అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రతిపక్ష నేతలను గౌరవించడం కూడా తెలుసుకోవాలన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పాడని, ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పాలని అన్నారు.