ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అధికార పార్టీకి షాకిస్తూ.. బీజేపీ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ విజయం సాధించడం.. కీలక పరిణామంగా చెప్పుకొవచ్చు. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ విజయ పథంలో దూసుకెళ్తోంది. ప్రతి చోటా వైసీపీనే విజయం సాధిస్తోంది. ఇక తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా తెలంగాణలో బలం పుంజుకుంటున్న కాషాయ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన ప్రభావం చూపింది. అంతేకాక ప్రతి ఎన్నికలో కూడా అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. తానే బలమైన ప్రత్యర్థి అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇక తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజీపీ.. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడమే కాక విజయం సాధించి.. షాకిచ్చింది. ఆ వివరాలు..
మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎవరూ ఊహించని ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి.. బీఆర్‌ఎస్‌కు గట్టి షాకిచ్చారు. ఇక కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచే బీజేపీ అభ్యర్థి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. గురువారం అర్ధరాత్రి దాటాక వెలువడిన ఫలితాల్లోఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు.
ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే ఇక్కడ తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. గురువారం అర్ధరాత్రి 1.40 గంటల వరకు ఎన్నికల లెక్కింపు జరిగింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. అంటే ఏ పార్టీ అభ్యర్థికీ కూడా 50 శాతం మించి ఓట్లు పడలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ క్రమంలో మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది.
తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపు పట్ల కాషాయ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి తెలంగాణలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.