జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కలిశారు. ఏపీలో రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితమే చంద్రబాబుని కలిసిన జనసేనాని.. తాజాగా మరోసారి భేటీ అవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై భేటీలో చర్చించినట్లు సమాచారం. విశాఖలో కొన్ని నెలల క్రితం పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో పవన్ ని పరామర్శించారు చంద్రబాబు. స్వయంగా చంద్రబాబు పవన్ ని కలిసి సంఘీభావం తెలిపారు. తాజాగా కుప్పం విషయమై చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.
అయితే ఈ భేటీపై అధికార పార్టీ విమర్శలు వ్యక్తం చేస్తుంది. చంద్రబాబు పర్యటనల్లో 11 మంది అమాయకులు చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం జీవో 1 జారీ చేసిన తర్వాతే పవన్, చంద్రబాబుని కలవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ ల భేటీపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ భేటీలో పొత్తులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు, పవన్ భేటీపై మీ అభిప్రాయం ఏమిటి? రెండు నెలల వ్యవధిలో మళ్ళీ చంద్రబాబుని కలవడంపై మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేయండి.