కేటీఆర్ సెల్ఫీ కోసం డబ్బులు అడిగారా? ఒక్కో సెల్ఫీకి రూ. 500 అడిగారా? ఆయనకు ఏం అవసరం? ఆయన అలా ఎందుకు అడుగుతారు అని అనుకుంటున్నారా? నిజంగానే ఆయన రూ. 500 అడిగారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు జనాల్లోకి వెళ్తే ఉండే ఆ క్రేజే వేరు. వారు కనబడితే ఎగబడి సెల్ఫీలు అడుగుతుంటారు. ముఖ్యంగా యంగ్ పొలిటీషియన్స్ వస్తే ఆ క్రేజ్ వేరే లెవల్ ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కోసం మహిళలు ఎగబడి సెల్ఫీలు అడిగారు. అయితే కేటీఆర్ సెల్ఫీకి రూ. 500 ఇవ్వాలని అన్నారు. కేటీఆర్ కి సెల్ఫీకి 500 తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన తెలంగాణ మంత్రి, బాగా పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. రాజుకి డబ్బుకి కొదవ అన్నట్టు బిందాస్ లైఫ్. అలాంటప్పుడు సెల్ఫీకి 500 రూపాయలు అడగడం ఏమిటి? అని అనుకుంటున్నారా? ఆయన అడిగింది నిజమే.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభించారు కేటీఆర్. గండిలచ్చపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించి.. కాసేపు ప్రసంగించారు. అలానే దళిత బంధు పథకం కింద ఇద్దరు సోదరులు కలిసి రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారంను కేటీఆర్ ప్రారంభించారు. అదే విధంగా ఎల్లారెడ్డిపేటలో దళిత బంధు పథకం కింద రైస్ మిల్లును ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాలినడకన వెళ్లిన ఆయనను సెల్ఫీలు అడిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో అందరినీ పలకరించుకుంటూ కాలినడకన వెళ్తున్నారు కేటీఆర్.
ఆ సమయంలో కేటీఆర్ తో సెల్ఫీ కోసం మహిళలు ఎగబడ్డారు. ఒక మహిళ సెల్ఫీకి రూ. 500 అవుతుంది అని అన్నారు. కేటీఆర్ కూడా సెల్ఫీకి రూ. 500 అవుతుంది అని అంటే ఓ మహిళ పర్లేదు అంటూ సెల్ఫీ దిగింది. సెల్ఫీకి 500 అయినా పర్వాలేదని అంటోంది అంటూ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.