పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బండి సంజయ్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది విద్యాసాగర్ హనుమకొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద బెయిల్ పిటిషన్ దాఖలు దాఖలు చేశారు. దీనికి ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్ పిటిషన్ వేశారు. అయితే బండి సంజయ్ ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అనంతరం బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి.
బండి సంజయ్ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పీపీ వాదనలు వినిపించారు. మరోవైపు బండి సంజయ్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాట్సాప్ మెసేజ్ ఆధారంగా బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని వాదన వినిపించారు. కస్టడీ పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసినట్టే.. బెయిల్ పిటిషన్ ను కూడా సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే వరుసగా 3 రోజులు కోర్టుకు సెలవులు కాబట్టి బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ. 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు.
కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని బండి సంజయ్ కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ కాగితాలు ఇవాళ రాత్రి కరీంనగర్ జైలుకు తీసుకెళ్లి సబ్మిట్ చేస్తారు. బెయిల్ ప్రక్రియ పూర్తయినా రాత్రి కాబట్టి తెల్లారి ఉదయం విడుదల చేసే అవకాశం ఉందని బండి సంజయ్ తరపు న్యాయవాది వెల్లడించారు. బండి సంజయ్ కు బెయిల్ రాదు అని అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయనకు బెయిల్ రావడంపై బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరి కోర్టు బండి సంజయ్ కు బెయిల్ ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.