మరో వీకెండ్ ఆగయా. ఓటీటీలో బోలెడన్ని సినిమాలు చూసేందుకు మీరు రెడీయా మరి. అవును ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గత వారాలతో పోలిస్తే కొన్ని తక్కువయ్యాయి కానీ అంతకు మించిన ఎనర్జీ ఇచ్చేందుకు ఈసారి ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. మెయిన్ గా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇదే కాదన్నట్లు పలు ఇంగ్లీష్ సినిమాలతో పాటు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి.
ఇక విషయానికొస్తే.. 2023 మొన్న మొన్న వచ్చినట్లు అనిపించింది. కానీ అప్పుడే జనవరి కంప్లీట్ అయిపోయింది. చిరు-బాలయ్య సినిమాల హడావుడి తగ్గింది. ఫిబ్రవరి వచ్చేసింది కాబట్టి పలు చిన్నాపెద్దా సినిమాలు థియేటర్లలోకి క్యూ కట్టేశాయి. అలానే ఓటీటీలోనూ పలు చిత్రాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. అలా ఈ శుక్రవారం ఏకంగా 16 సినిమాలు/ సిరీసులు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ తోపాటు ముఖచిత్రం, సెంబి లాంటి సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంగ్లీష్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి