హైదరాబాద్- తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో నగరవాసులకు బాగా తెలుసు. వాహనదారులు ఏ మాత్రం ట్రాఫిక్ నిబందనలు పాటించకపోయినా, రూల్స్ ను అతిక్రమించినా పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించరు. వెంటనే సదరు వాహనానిన్ని తమ దగ్గర ఉన్న కెమోరాతో ఫోటో తీసి, ఛలాన్ వేసేస్తారు. ఇంకే ముంది ఆ తరువాత ఖచ్చితంగా ఫైన్ కు సంబందించిన ఛలాన్ కట్టాల్సిందే.
లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ వాహనానికి ఎంత మేర పెండింగ్ ఛలాన్లు ఉన్నాయో చెక్ చేసి, అక్కడే ఆన్ లైన్ పేమెంట్ చేయించుకుంచారు ట్రాఫిక్ పోలీసులు. ఇదిగో ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నగరవాసులు కొందరు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ట్రాఫిక్ నిబందనలను అతిక్రమించినా, పోలీసులు తమ వాహనాన్ని పోటో తీసినా నెంబర్ ప్రేట్ పడకుండా ఓ ట్రిక్ ఉపయోగిస్తున్నారు.
వాహనానికి వెనకవైపు ఉన్న నెంబర్ ప్లేట్ కు ఎంచక్కా మాస్క్ ను తొడుగుతున్నారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని ఫోటో తీసినా నెంబర్ కనిపించదు. ఇదిగో ఇలా అతి తెలివిగా వ్యవహరించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్‌ని తొడుగుతున్న వాహనదారుల మీద పోలీసులు సెటైర్ వేస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు.
వీరంతా కొత్త వేరియంట్ బాధితులు, వీరిని సరైన ఐపీసీ సెక్షన్లతో ట్రీట్ చేయాల్సి ఉంది.. అని ఫన్నీగా ట్వీట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అంటే ఇకపై ఇలా నెంబర్ ప్లేట్స్ కు మాస్క్ పెట్టి తిరిగే వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారని తెలుస్తోంది. అందుకే మాస్క్ ముఖానికి పెట్టుకొండి, అంతే కానీ బైక్ నెంబర్ ప్లేట్ కు కాదు.
These new variant patients will be treated with proper IPC sections.#CaptionPlease pic.twitter.com/buKGT6GdcK
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) December 7, 2021