క్రేజీ థింగ్స్ చేసి జనాల్లో పేరు సంపాదించేందుకు ఆత్రుత చూపిస్తున్నారు నేటి యువత. ఫేమ్, నేమ్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఆ పిచ్చి పరాకాష్టకు చేరింది. వీడియోలు వైరల్ అవ్వడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్కిట్లు చేస్తున్నారు.
క్రేజీ థింగ్స్ చేసి జనాల్లో పేరు సంపాదించేందుకు ఆత్రుత చూపిస్తున్నారు నేటి యువత. ఫేమ్, నేమ్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఆ పిచ్చి పరాకాష్టకు చేరింది. వీడియోలు వైరల్ అవ్వడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్కిట్లు చేస్తున్నారు. బైక్ పై అమ్మాయిలను కూర్చొబెట్టుకుని స్టంట్లు చేయడం వంటి సంఘటనలు చూశాం. అలాగే మెట్రోల్లోనూ డ్యాన్సులు చేస్తూ, నడిరోడ్డుపై హంగామా సృష్టిస్తూ.. వాటిని వీడియోలుగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. అయితే ఆ ఫన్నీల్లో లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. తాజాగా అటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఎప్పటికప్పుడు ప్రమాదాలను గురించి ప్రజలను అలర్ట్ చేస్తూ ఉండే తెలంగాణ ఆర్టీసీఎండీ సజ్జనార్ ఇటీవల ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించారు. పాపులర్ అవ్వడం కోసం ఓ వ్యక్తి రెండు పట్టాల మీద పడుకోగా.. అతడి మీద నుండి రైలు వెళుతున్న వీడియోను పోస్టు చేసిన ఆయన ‘ సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఫేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణ్ణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?’అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో చూస్తే నిజంగా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ఇదే సాహసం మీరు ఉన్నత స్థాయికి వెళ్లడంలో, అమ్మ నాన్నలను మంచిగా చూసుకోవడంలో పెట్టండి. ఇలా రైలు పట్టాలమీద కాదు బ్రదర్ అంటూ నెటిజన్ తిట్టిపోస్తున్నారు.
సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది.
జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023