గత కొన్ని రోజులుగా ఏపిలో అధికార పార్టీ, ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలో వంగవీటి రాధా తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో అధికార, ప్రతిపక్షాల మద్య మరోసారి రచ్చ మొదలైంది. వంగవీటి రాధాకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మద్దతుగా నిలిచారు. ‘రాధాను టచ్ చేసి చూడండి.. తీవ్ర పరిణామాలు ఉంటాయి’అని హెచ్చరించారు. వంగవీటి రాధా టీడీపీ కుటుంబ సభ్యుడని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను ముట్టుకుంటే ఒకటికి పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.
ధర్మవరంలో జరిగిన ‘గౌరవ సభ – ప్రజా సమస్యల చర్చా వేదిక’ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. విజయవాడ రాజకీయాల గురించి గతంలో ఎక్కువగా మాట్లాడని పరిటాల శ్రీరామ్ తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రాధా టీడీపీ కుటుంబ సభ్యుడని.. ఆషామాషీ అనుకుంటున్నారా.. టీడీపీ కార్యకర్తలను ముట్టుకుంటే ఒకటికి పది ఉంటాయన్నారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.
ఇది చదవండి : బాలయ్యను ఢీ కొట్టనున్న మరో స్టార్ హీరో! ఇక దబిడి దిబిడే!
వంగవీటి రాధాపై రెక్కీ జరిగిందంటూ వచ్చిన వార్తలపై ఇప్పటికే టీడీపీ నేతలతా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. మరోవైపు రాధా రెక్కీ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెక్కీ ఆరోపణలకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా టాటా మరోసారి వెల్లడించారు. వంగవీటి రాధాను కలిసి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారని.. త్వరలోనే ఈ కేసుపై అన్ని వివరాలు వెల్లడిస్తామని సీపీ క్రాంతి పేర్కొన్నారు.