ఫిల్మ్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.
అల్లు అర్జున్ ఊర మాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఐతే పుష్ప సినిమాలో క్లైమాక్స్ సీన్ పై మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. క్లైమాక్స్‌లో అల్లు అర్లున్, విలన్ ఫహద్ ఫాజిల్ అర్థనగ్నంగా కనిపించారు కదా. ఇద్దరు కేవలం అండర్ వేర్ లో కనిపించే పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. ఐతే ఈ క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో ఈ క్లైమాక్స్ సీన్‌పై డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్ ఇద్దరూ ప్యాంట్ షర్ట్ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు.. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా.. కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం.. అని సుకుమార్ పేర్కొన్నారు.
అంతే కాదు పుష్ప పార్ట్ 2లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు సుకుమార్. పుష్ప మొదటి భాగంతో కేవలం ఆయా పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, సెకండ్ పార్ట్‌లో అసలు కధ ఉంటుందని తెలిపారు. మరి పుష్ప-2 కధ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.