శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంగోడ, కడిగమువా మధ్య కొండచరియలు విరిగిపడడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. . ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అలర్ట్ అయి రైలులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. పెద్ద ప్రమాదమే తప్పడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది.గత కొన్ని రోజులుగా శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గంగోడ, కడిగమువా పరిసర ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు నదిలా కొట్టుకొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలుపై కొండచరియలు విరిగిపడటంతో రైలు ఊహించని విధంగా పట్టాలు తప్పింది. భారీ శబ్దంతో బోగీలు పక్కకు జరగడంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
ప్రమాదం జరిగిందనే సమాచారం అందుకున్న వెంటనే శ్రీలంక రైల్వే , అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొండచరియలు పడిన ప్రాంతంలో చిక్కుకుపోయిన రైలు నుంచి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అధికారులు ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.సంతోషించాల్సిన విషయమేమిటంటే… కొండచరియలు భారీ స్థాయిలో విరిగిపడినప్పటికీ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఏ ఒక్క ప్రయాణికుడికి కూడా తీవ్ర గాయాలు కాకపోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. అయితే, ట్రాక్‌పై భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో పాటు రైలు పట్టాలు దెబ్బతినడంతో ఆ మార్గంలో రైల్వే రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు, ఇంజనీరింగ్ సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు పనులు వేగవంతం చేశారు
ప్రస్తుతానికి శ్రీలంకలో వర్షాల తీవ్రత దృష్ట్యా కొండ ప్రాంతాల మీదుగా వెళ్లే రైలు మార్గాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం లేదా వేగాన్ని తగ్గించడం చేస్తున్నారు.
#SriLankaLandslide: “श्रीलंका में टला बड़ा रेल हादसा!” भारी बारिश और भूस्खलन के बाद पटरी से उतरी ट्रेन।
.
.
#SriLanka #SriLankaTrainAccident #TrainAccident #TrainDerailment #Landslide #SriLankaRailways #Gangoda #Kadigamuwa https://t.co/W8yefejffo— Dainik Bhaskar Hindi (@DBhaskarHindi) October 9, 2026
