ఫిల్మ్ డెస్క్- మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి అందరికి తెలిసిందే. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్ కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఆయనను జూబ్లీహిల్స్ లోని ఆపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందించారు.
సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం అయిన తొలి 10 రోజులు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని కంగారు పడినట్లు ఆయన కుటుంబ సభ్యులే తెలిపారు. ఐతే అదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత సెప్టెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఆ సమయంలో సాయి కోమాలోనే ఉన్నట్లు చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తరువాత మెల్ల మెల్లగా కోలుకుని స్పృహలోకి వచ్చాడు. అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు డాక్టర్లు. అది కచ్చితంగా సాయికి మరో జన్మలాంటిదే, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం అనేది నిజంగా పునర్జన్మ.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు.
ఇక అసలు విషయానికి వస్తే.. అసలు సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి బిల్లు ఏంతైందన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రమాదం జరిగిన నాటి నుంచి సాయి ధరమ్ తేజ్ దాదాపు 36 రోజులు అపోలో ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ 36 రోజులకు అపోల్ ఆస్పత్రి ఎంత మేర బిల్లు వేసి ఉంటుందబ్బా అని అభిమానులు ఆసక్తికనబరుస్తున్నారు. మాములుగా ఒకటి రెండు రోజులు కార్పోరేట్ ఆస్పత్రిలో ఉంటేనే లక్షల్లో బిల్లు అవుతుంది.
అలాంటిది సాయి ధరమ్ తేజ్ ఏకంగా 36 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు కదా.. మరి బిల్లు కోట్లల్లో అయి ఉంటుందా అని అనుకుంటున్నారు. ఐతే సాయి ధరమ్ తేజ్ చికిత్స తీసుకున్న ఆస్పత్రి రామ్ చరణ్ భార్య ఉపాసన వాళ్లదేనని చాలా మందికి తెలుసుండదు. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ కు భారీ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉందట. కాబట్టి ఆయన ఆస్పత్రి ఖర్చుంగా ఇన్సూరెన్స్ కంపెనీ భరించి ఉంటుందని తెలుస్తోంది. ఐతే బిల్లు ఏంతైందన్నది మాత్రం అపోల్ ఆస్పత్రి వెల్లడించలేదు.