ఫిల్మ్ డెస్క్- RRR.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న సినిమా. ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో RRR పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక RRR మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ తో పాటు సముద్ర ఖని, శ్రియా శరన్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ తదితరులు నటించారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపధ్యంలో RRR రాజమౌళి సినిమా ప్రమోషన్ పై దృష్టి సారించారు. ఈమేరకు దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన RRR పాటలు, ప్రోమోలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై ఉన్న అంచనాలను రెండింతలు చేశాయి. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం RRR నుంచి మరో పాటను విడుదల చేశారు. రైజ్ ఆఫ్ రామ్.. పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ రాశారు. శివ శక్తి దత్త రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చారు హరిహరన్ తదితరులు ఆలపించారు.
సుమారు 600 కోట్ల బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలు మూవీ రిలీజ్ కానుంది. దీంతో సహా మరో ఐదు భాషల్లో కూడా సినిమాను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఈ సినిమాలో నటించారు. చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని ఈ రెండు క్యారెక్టర్స్.. కలుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఊహాజనిత కధ ఆధారంగా చేసుకుని రాజమౌళి RRR సినిమాను 1920 బ్యాక్ డ్రాప్‌లో రూపొందించారు.