యూపీలో లక్నోకు చెందిన ప్రియదర్శని అనే యువతి అందరికీ గుర్తుండే ఉంటుంది. జూలై 30న రాత్రి క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించి ప్రియదర్శిని వార్తల్లో నిలిచింది. అప్పటి నుండి ఈమెకి ‘థప్పడ్ గర్ల్’ అని పేరు పెట్టేశారు నెటిజన్స్. తప్పు తనదే అయినా.. ఏ మాత్రం సంకోచం లేకుండా.., క్యాబ్ డ్రైవర్ ని 22 సార్లు చెంపలు వాయించింది ఈ యువతి.
ఈ విషయంలో తరువాత పోలీస్ విచారణ జరగడం, తప్పు ఆమెదే అని ప్రూవ్ చేయడం, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చకచకా జరిగిపోయాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా ప్రియదర్శనిపై వ్యతిరేకత మొదలైంది. “అరెస్ట్ యూపీ గర్ల్” అంటూ.. అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడించింది. అయితే.., ఇప్పుడు ప్రియదర్శని తాను చేసిన తప్పుని తెలుసుకున్నట్టు అనిపిస్తోంది.
రక్షాబంధన్ రోజున ప్రియదర్శిని తన ఇంటిని అందంగా అలంకరించి, ప్రత్యేకమైన స్వీట్లు కొనుగోలు చేసి, ఆ డ్రైవర్‌కు సాదరంగా ఆహ్వానం పలికింది. “నేను ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నా. ట్యాక్సీ డ్రైవర్ సాదత్ అలీ సిద్ధిఖీకి నేను ఆహ్వానం పలుకుతున్నా. అతను కూడా అన్నీ మర్చిపోయి ఇంటికి వస్తే రాఖీ కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అంటూ ట్వీట్ చేసింది. కానీ.., ట్యాక్సీ డ్రైవర్ సాదత్ మాత్రం ప్రియదర్శని ఆహ్వానంపై అస్సలు స్పందించలేదు.
రాఖీ కట్టాలి అనుకున్న ప్రియదర్శని తానే వెళ్లి కట్టాలి గాని.., డ్రైవర్ ని సాదత్ ని ఇంటికి రమ్మనడం ఏమిటి? ఎందుకంటే తప్పు చేసింది ప్రియదర్శని. కాబట్టి.., స్వయంగా వెళ్లి ఆమె కదా రాఖీ కట్టాల్సింది? ట్యాక్సీ డ్రైవర్ సాదత్ ఈమె దగ్గరికి ఎందుకు వస్తాడు? అ సలు ప్రియదర్శని ఈ ఆహ్వానసం మనసు పూర్తిగానే పంపిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. యూపీ యువతి ప్రియదర్శని వ్యవహార శైలిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.