ప్పుడు ప్రపంచమంతా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మీదనే ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు సాయంత్రమే చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప యావత్ భారతదేశం మొత్తం ఈ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచమంతా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మీదనే ఆసక్తి కనబరుస్తోంది. ఈరోజు సాయంత్రమే చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప యావత్ భారతదేశం మొత్తం ఈ మిషన్ విజయవంతమవ్వాలని కోరుకుంటున్నారు. మతాలకు అతీతంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. చంద్రయాన్-2 మిషన్ విఫలం తరువాత ఇస్రో ప్రయోగించిన మిషన్ కావడం.. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో భారతదేశం అంటే ఒక విశ్వగురువు అన్న అభిప్రాయం రావడం వంటి అంశాల కారణంగా చంద్రయాన్-3 ఖచ్చితంగా విజయవంతం కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.
చంద్రుడి మీద నీరు ఉందని గుర్తించిన ఘనత భారతదేశానిదే కావడం.. అందులోనూ ఇప్పటివరకూ ఏ దేశం చేయనటువంటి సాహసం చేస్తున్న కారణంగా అందరి చూపు చంద్రయాన్-3 మీదనే ఉంది. ఇప్పటికే పలు చోట్ల చంద్రయాన్-3 విజయవంతం కావాలని పూజలు, ప్రార్థనలు చేశారు. తాజాగా లక్నోలోని ముస్లిం సోదరులు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో నమాజ్ చేశారు. చంద్రుడి మీద చంద్రయాన్-3 మిస్ సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి లండన్ లో మాట్లాడారు.
భారత్ సాధించిన అద్భుత విజయానికి ఇంతకంటే గొప్పది మరొకటి ఉండదని.. ఒక భారత దౌత్యవేత్తగా కాకుండా భారతీయుడిగా గర్విస్తున్నానని అన్నారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పుడే మన దేశం అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని.. నేడు ఇది కేవలం మానవ కల్పనకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష కార్యక్రమమని అన్నారు. చంద్రుడి మీద దేన్నైనా ల్యాండ్ చేయగల అతికొద్ది దేశాల్లో మన దేశం కూడా ఉందని.. ప్రపంచంలో అందరి కంటే ముందుందని అన్నారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్ ని చేపట్టిన భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రష్యా పంపించి లూనా-25 మిషన్ విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3పై పడింది. ఈ మిషన్ ఇవాళ సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టబోతుంది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం మన కాలమానం ప్రకారం సాయంత్రం 5:20 జ్ఞాతలకు ప్రారంభమవుతుంది. ల్యాండింగ్ లైవ్ ని ఇస్రో వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్, పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ డీడీ నేషనల్ టీవీలో వీక్షించవచ్చు.
#WATCH | Uttar Pradesh | People offer namaz at the Islamic Center of India in Lucknow for the successful landing of Chandrayaan-3, on August 23. pic.twitter.com/xpm98iQM9O
— ANI (@ANI) August 22, 2023