ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ తాజా సినిమా అఖండ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాలయ్య బాబు ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. చివరి షెడ్యూల్ షూటింగ్‌లో ఉంది. అఖండలో బాలకృష్ణ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇక అఖండ సినిమాలో నటిస్తున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ తో కలిసి నటించడంపై స్పందించంది.
బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ముందు చాలా భయమేసిందని చెప్పింది ప్రగ్యా. అఖండ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు కూడా మొదట్లో బాలయ్య బాబును చూస్తేసి భయపడేదాన్నని చెప్పుకొచ్చింది. ఐతే ఆ తరువాత ఆయన ఎంత సరదా మనిషి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదనేది అర్థమైందని అంది ప్రగ్యా జైస్వాల్. షూటింగ్ లో బాలకృష్ణ చాలా హుషారుగా ఉంటూ సెట్ అంతా సందడి చేస్తారని చెప్పింది.
బాలకృష్ణ గురించి బయట విన్న దానికి, ఆయన క్యారెక్టర్ కు సంబంధమే లేదని అంది ప్రగ్యా. అఖండ సినిమాలో తనది ప్రాధాన్యతతో కూడిన మంచి పాత్ర అని ఆమె చెప్పంది ప్రగ్యా జైస్వాల్. కేవలం గ్లామర్ పాత్రకు పరిమితం కాకుండా, చిత్రంలో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. సినిమా కథలో కూడా తన పాత్రకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని, ఇలాంటి సినిమా ఛాన్సులు చాలా అరుదుగా వస్తాయని ప్రగ్యా సంతోషం వ్యక్తం చేసింది.
అంతే కాదు ఈ సినిమాతో తన కెరీర్ టర్న్ అవుతుందని ఎగ్జైట్ అవుతోంది ప్రగ్యా జైస్వాల్. ఇక బాలయ్య అభిమానులు అఖండ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ ఫస్ట్ లుక్, టీజర్ లో బాలయ్య పెర్ఫామెన్స్ అదిరిపోయింది.