ఫిల్మ్ డెస్క్- బండ్ల గణేష్.. సంచలనాలకు మారు పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరై.. ఇప్పుడు పెద్ద నిర్మాతగా మారారు బండ్ల గణేష్. ఆ మధ్య రాజకీయనాయకుడిగా కూడా మారి, అంతగా కలిసి రాకపోవడంతో ఇప్పుడు కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ఆశిస్సుల వల్లే తాను నిత్మాత అయ్యానని చాలా సందర్బాల్లో చెప్పాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ ఆయనకున్నపై భక్తి గురించి ఈ మధ్యే కొత్తగా చెప్పారు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ పవన్ ను పూజిస్తారు బండ్ల గణేష్. ఇక మొన్నా మధ్య ఓ టీవీషోలో పాల్గొన్న బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పై మరో లెవల్ లో తన భక్తిని చాటుకున్నారు. వెంకటేశ్వర స్వామికి ఏం ఉత్సవాలు చేస్తారో డాలర్ శేషాద్రికి తెలియదా, అలాగే పవర్ స్టార్ గురించి బండ్ల గణేష్‌కి తెలియదా అంటూ వ్యాఖ్యానించారు గణేష్.
బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మరో లోకానికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు దేవర అని ప్రత్యేకంగా పేరు పెట్టారు బండ్ల గణేష్. భక్త కన్నప్ప శివుడిని దేవర అని పిలిచేవాడని, అందుకే ఇకపై తాను కూడా పవన్ కళ్యాణ్‌ని దేవర అని పిలుస్తానని బండ్ల గణేష్ ఈ పేరు పెట్టడానికి గల కారణాన్ని చెప్పారు. ఇంకేముంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ సైతం దేవర అనే పిలుచుకుంటున్నారు.
తన ఆరాద్య హీరో పవన్ కళ్యాణ్‌తో త్వరలో సినిమా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆ సినిమాకి దేవర అనే టైటిల్ పెడితే బాగుంటుందని పవన్ అభిమానుల నుంచి బండ్ల గణేష్ కు విజ్ఞప్తులు వస్తున్నాయట. జనసైనికులు ట్విట్టర్‌లో దేవర అనే టైటిల్ ఫిక్స్ చేయి అన్నా సూపర్ ఉంది అని బండ్ల గణేష్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ని బండ్ల గణేష్ రీట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
టైటిల్ కూడా #దేవర అనే ఫిక్స్ చేయ్ అన్నా సూపర్ ఉంది 🔥🙏. @ganeshbandla…
Annaya @PawanKalyan…,💥💥🙏#Devara #PawanKalyan pic.twitter.com/ldCaFKZB2x— Bûllï Ñãîdü Bîrüßû (@BulliRaju143) July 17, 2021