ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాలు పెద్దగా లేవు. కానీ ఓటీటీల్లో మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వారం వివిధ ఓటీటీ వేదికల్లో భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఏ ఓటీటీలో ఏ సినిమా లేక వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో ఓసారి చెక్ చేద్దాం..
ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన వార్ 2, కూలీ మినహా మరే ఇతర భారీ సినిమాలు లేవు. ఈ వారం అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా, మేఘాలు చెప్పిన ప్రేమకధ, త్రిబాణదారి బార్బరిక్ వంటి చిత్రాలు మాత్రమే థియేటర్ రిలీజ్ అయ్యాయి. అయితే ఓటీటీల్లో మాత్రం ఏకంగా 31 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని తెలుగు కాగా మిగిలినవి డబ్బింగ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా ఈ వారమే ఓటీటీలో వచ్చింది. అటు మిషన్ ఇంపాజిబుల్, మారిషస్, కొత్తపల్లిలో ఒకప్పుడు వంటి సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ లిస్ట్ ఓసారి చెక్ చేద్దాం. ఈ వారం అంటే ఆగస్టు 18 నుంచి 24 మధ్యలో స్ట్రీమింగ్ అవుతున్నవి, విడుదల కానున్నవి..
నెట్‌ఫ్లిక్స్‌లో…
ఆగస్టు 18న కోకోమెలన్ లేన్ సీజన్ 5 ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
ఆగస్టు 18న ఎక్స్‌టంట్ సీజన్ 1 మరియు 2 ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
ఆగస్టు 19న అమెరికాస్ టీమ్ ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
ఆగస్టు 20న ఫిస్క్ సీజన్ 3 వెబ్‌సిరీస్
ఆగస్టు 20న రివర్స్ ఆఫ్ ఫేట్ పోర్చుగీస్ సిరీస్
ఆగస్టు 21న ఫాల్ ఫర్ మి, గోల్డ్ రష్ గ్యాంగ్ సినిమాలు
ఆగస్టు 21న హోస్టేజ్ వెబ్‌సిరీస్
ఆగస్టు 21న వన్ హిట్ వండర్, ది 355 సినిమాలు
ఆగస్టు 22న అబాండెన్డ్ మ్యాన్ సినిమా
ఆగస్టు 22న ఏయిమా కొరియన్ సిరీస్, లాంగ్ స్టోరీ షార్ట్ సిరీస్
ఆగస్టు 22న మారిషన్ తెలుగు డబ్ సినిమా
ఆగస్టు 22న ద ట్రూత్ ఎబౌట్ జెస్సీ స్మోలెట్ సినిమా
అమెజాన్ ప్రైమ్‌లో…
ఆగస్టు 18న మిషన్ ఇంపాజిబుల్ సినిమా
ఆగస్టు 22న సార్ మేడమ్ తెలుగు డబ్ సినిమా
ఆగస్టు 22న ఎఫ్ 1 తెలుగు డబ్ సినిమా
జీ5లో..
ఆగస్టు 22న అమర్ బాస్ బెంగాలీ సినిమా
ఆగస్టు 22న సోదా కన్నడ సిరీస్
జియో హాట్‌స్టార్‌లో…
ఆగస్టు 19న స్టాకింగ్ సమంత సిరీస్
ఆగస్టు 20న ది ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ సిరీస్
ఆగస్టు 22న ఏనీ మేనీ ఇంగ్లీష్ సినిమా
ఆగస్టు 22న పీస్ మేకర్ సీజన్ 2 ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
ఆహాలో కొత్తపల్లిలో ఒకప్పుడు తెలుగు సినిమా, సన్‌నెక్స్ట్‌లో కపటనాటక సూత్రధాని కన్నడ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. లయన్స్ గేట్ ప్లేలో ఆగస్టు 22న వుడ్ వాకర్స్ సినిమా విడుదల కానుంది.