నేపాల్‌లో వరదలు మరోసారి బీభత్సం సృష్టించాయి. బుధి గండకీ నది పోటెత్తడంతో గోర్ఖా జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసం కాగా, 3 బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ‘లోక్పా, చుమ్లింగ్ మధ్య నది ప్రవాహానికి కొండచరియలు ఆనకట్టలా అడ్డుపడ్డాయి. అది తెగడంతో వరదలు వచ్చాయి.. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆగస్టులో వచ్చిన ఆకస్మిక వరదలతో 1400 మందికిపైగా చనిపోయిన విషాదకర గాయాలు మనకముందే నేపాల్ లో మరోసారి వరదలు భయందోళనకు గురిచేస్తున్నాయి.
నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపించింది. ప్రసిద్ధ బుధి గండకీ నది ఒక్కసారిగా పోటెత్తింది. నది ఉధృతికి ఆ ప్రాంతంలోని పలు నివాసాలు నేలమట్టమయ్యాయి. అంతేకాకుండా, అక్కడి స్థానికులను బయటి ప్రపంచంతో అనుసంధానించే మూడు కీలకమైన వంతెనలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. లోక్పా, చుమ్లింగ్ ప్రాంతాల మధ్య నది ప్రవాహానికి భారీ కొండచరియలు అడ్డుగా వచ్చి ఒక తాత్కాలిక ఆనకట్టలా డ్యామ్ ఏర్పడింది.. ఆ కొండచరియల కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో… భారీ నీటి ప్రవాహం ఆకస్మికంగా దిగువ ప్రాంతాలపై విరుచుకుపడింది. దీంతో క్షణాల వ్యవధిలో అంతా అతలాకుతలమైంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారుల నుంచి రావాల్సి ఉంది.
ఇక ఈ వరద ప్రవాహ దృశ్యాలు చూస్తుంటే.. ఆగస్టు నెలలో జరిగిన పెను విషాదం గుర్తుకొస్తుంది. సరిగ్గా కొన్ని నెలల క్రితం… అంటే ఆగస్టులో వచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను ఎంతగా కోలుకోలేని దెబ్బతీశాయో మనందరికీ తెలిసిందే. ఆ ప్రకృతి విలయ తాండవానికి ఏకంగా 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లూ వాకిలి కోల్పోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు. ఆ సునామీ సృష్టించిన గాయాలు ఇంకా అలానే ఉన్నాయి.. బాధితులు ఆ దుర్ఘటనను తలుచుకుని ఇప్పటికీ కన్నీరు పెట్టుకుంటున్నారు. అప్పుడే కోలుకుంటున్న నేపాల్ ప్రజలపై, కాలం మరోసారి పగబట్టినట్లుగా ఈ తాజా వరదలు విరుచుకుపడ్డాయి .అసలు నేపాల్‌ను వరదలు ఎందుకు ఇలా పదే పదే వణికిస్తున్నాయి..అనే దానికి గురించి తెలుసుకుంటే… గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు, భూకంపాల వల్ల బలహీనపడిన కొండలు నిరంతరం విరిగిపడుతున్నాయి.ఇలా కొండచరియలు నదుల్లో పడి తాత్కాలిక డ్యామ్‌లుగా మారుతున్నాయి. వర్షాల తీవ్రత పెరిగినప్పుడు ఆ మట్టి కట్టలు తెగిపోయి దిగువ ప్రాంతాలపై సునామీలా విరుచుకుపడుతున్నాయి. ఇది కేవలం వర్షాకాలం సమస్య మాత్రమే కాదు… ఏడాది పొడవునా నేపాల్ ప్రజలను నిద్రలేకుండా చేస్తున్న ఒక పెద్ద శాపంగా మారుతోంది.
ఒకవైపు కుటుంబాలను కోల్పోయిన బాధ… మరోవైపు మళ్లీ ముంచుకొస్తున్న వరదల భయం. నేపాల్ ప్రజల జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ప్రకృతి ముందు మానవ ప్రయత్నాలు కొన్నిసార్లు చేతులెత్తేస్తున్నాయి. ఈ తాజా వరదలలో ఎంతమంది ప్రాణాలు కాపాడబడ్డాయో, ఎంతటి నష్టం జరిగిందో…అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఏదేమైన వరుస వరదలు కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి…
