మన బాలీవుడ్ బాక్సాఫీస్ ధురంధరుడు రణ్‌వీర్ సింగ్ రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది థియేటర్లలో తన యాక్షన్‌తో పూనకాలు తెప్పించిన రణ్‌వీర్.. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్టేజ్‌పై దుమ్ము రేపడానికి రెడీ అయ్యాడు! రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది! ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలోకి మన ‘ధురంధర్దీనికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం

ఒకటి కాదు.. రెండు కాదు.. టీ-సిరీస్, బి62 స్టూడియోస్ సంస్థలు ఈ ఆల్బమ్‌ను ఏకంగా 9 వివిధ విభాగాల్లో గ్రామీ అవార్డుల రేసు కోసం సబ్‌మిట్ చేశాయి! అంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థం చేసుకోండి. ఈ సినిమాకి శాశ్వత్ సచదేవ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మైండ్ బ్లోయింగ్ ట్యూన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ అంతా గ్రామీ ఓటర్లను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఆల్బమ్‌లో ఇండియన్ యూత్ హార్ట్ థ్రోబ్ అరిజిత్ సింగ్ పాడిన పవర్‌ఫుల్ సాంగ్‌తో పాటు, మిగతా క్రేజీ ట్రాక్స్ అన్నీ ఈ తొమ్మిది విభాగాల్లో పోటీ పడుతున్నాయి.
అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ప్రస్తుతం ఇది కేవలం ఫర్ యువర్ కన్సిడరేషన్ ప్రాథమిక పరిశీలన లిస్ట్ మాత్రమే. అంటే గ్రామీ కమిటీ వాళ్ళు ఈ పాటలను పరిశీలిస్తారు. దీని తర్వాతే అసలైన షార్ట్‌లిస్ట్, ఆ పైన తుది నామినేషన్లు అనౌన్స్ చేస్తారు. ఏదేమైనా, ఇండియన్ మ్యూజిక్ హవా గ్లోబల్ లెవెల్‌లో నడుస్తోంది అనడానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫైనల్ నామినేషన్స్ లోకి కూడా ఈ ఆల్బమ్ దూసుకెళ్తే.. మనోళ్లు గ్రామీ స్టేజ్‌పై జెండా పాతడం ఖాయం.
