బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆన్‌లైన్ ట్రోలింగ్, బాడీ షేమింగ్‌పై గట్టిగా స్పందించారు. ఇంటర్నెట్‌లో వచ్చే నెగటివ్ కామెంట్లకు భయపడి కూర్చుంటే లైఫ్‌లో అస్సలు ముందుకు వెళ్లలేమని ఆమె తేల్చి చెప్పారు. లండన్‌లో జరిగిన తన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ యానివర్సరీ ఈవెంట్‌లో కత్రినా ఈ విషయాలను పంచుకున్నారు.
కొడుకు పుట్టిన తర్వాత కత్రినా రీసెంట్‌గా ఫస్ట్ టైమ్ ఓ ప్రోగ్రామ్‌లో కనిపించినప్పుడు, కొందరు నెటిజన్లు ఆమె లుక్స్ మరియు బాడీ షేప్‌పై దారుణంగా కామెంట్లు చేశారు. దీనిపైనే కత్రినా ఇప్పుడు నోరు విప్పారు. “సోషల్ మీడియాలో ఎవరెవరో అనే మాటల వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోకూడదు. ప్రతి ఒక్కరి మాటను సీరియస్‌గా తీసుకుంటే, మన లైఫ్ గురించి మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేం. నాపై వచ్చే ప్రతి విమర్శ గురించి ఆలోచించి ఉంటే, నేను భయంతో ఎప్పుడో వెనకబడిపోయేదాన్ని” అని కత్రినా చెప్పుకొచ్చారు.

Katrina Kaif Online Trolling News
కొన్నిసార్లు ప్రపంచమంతా మనల్ని మెచ్చుకుంటుందని, కానీ మరికొన్నిసార్లు మనకు మనమే ధైర్యం చెప్పుకోవాల్సి వస్తుందని ఆమె అన్నారు. గతేడాది నవంబర్‌లో కత్రినా ఒక బాబుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చాయి. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె ఇలా బోల్డ్‌గా ఆన్సర్ ఇవ్వడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
