టాలీవుడ్ తెరపైకి ఎందరో హీరోయిన్స్ వస్తుంటారు.. పోతూంటారు. కొంత మంది ఒకటి, రెండు సినిమాలకే పరిమితమవుతారు. కొందరు మాత్రమే అభిమానుల మనుసులో స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అతి కొద్ది మందిలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. తాజాగా ఈ బ్యూటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇటీవలే కత్రీనా కైఫ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈ వేడుకల్లో ఇలియానా కూడా చేరింది. ఇలియానాకి, కత్రినాకి అంత క్లోజ్ రిలేషన్ లేదు అయినా సెలబ్రేషన్స్ కి వచ్చింది. ఎందుకు అని ఆరా తీస్తున్నారు. కత్రినా సోదరుడు సెబాస్టియన్ తరుపునే ఇలియానా వెళ్లినట్లు తెలుస్తుంది. కత్రీనా, ఇలియానా కూడా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన గ్రూప్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇలియానా, సెబాస్టియన్ గత కొంతకాలంగా లవ్ లో ఉన్నట్టు బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
గతంలో ఈ గోవా బ్యూటీ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో ప్రేమలో ఉంది. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. మరి సెబాస్టియన్ తో డేటింగ్ గురించి ఈ గోవా బ్యూటీ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. మరి ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.