సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చి తమ టాలెంట్ చూపించాలనుకునేవారికి పలు వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి.
సినిమా మీద ఫ్యాషన్‌తో ఎంతో మంది నటిమణులు సినీ పరిశ్రమకు వస్తారు. హీరోయన్‌గా మంచి క్యారెక్టర్ అర్టీస్ట్‌గా నిరుపించుకొవాలని ఎవరికైనా ఉంటుంది. ఎంతో టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి వచ్చే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న యువతులను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొందమంది దారుణాలకు పాల్పపడుతున్నారు.. ఇండస్ట్రీకి రాకుండా చేస్తున్నారన ఎంతోమంది ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అడిగింది ఇస్తేనే సినీ పరిశ్రమలో మీకు అవకాశాలు ఉంటాయని లేకపోతే ఉండవని బెదిరింపులు క్యాస్టింగ్ కౌచ్‌లో ఒ భాగమే. దీనిపై ఎంతోమంది హీరోయిన్స్, సైడ్ యాక్టర్స్ వివిధ సందర్భాల్లో చెప్పుకోచ్చారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఓ హీరోయిన్ స్పందించింది. తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింద
ప్రాచీ ఠాకర్.. రాజుగారి కోడి పులావ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తను మాట్లాడుతూ..” చిన్నప్పటి నుంచి నాకు సినిమాలపై చాలా ఆసక్తి ఉంది. ఎప్పటికైనా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలనుకున్నాను. అనుకున్నట్టుగానే.. పటాస్ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఇంకా నా చదువు పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే ఓ యాడ్ ఏజేన్సి వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్ ఉంది చేస్తారా అని అడిగారు నేను సరే అన్నాను. నాకు తెలుగు భాష రాకపోవడంతో నా ఫ్రేండ్‌ను మిడియేటర్‌గా పెట్టుకున్నాను. అన్నీ తానే చూసుకునేవాడు. ఏజేన్సి వాళ్ళు చెక్ కూడా ఇచ్చారు. నా సెల్ నెంబర్ తీసుకున్నారు. షూటింగ్ ఎప్పుడనేది చెప్తాము అన్నారు. నేను సరే అన్నాను.
కొద్ది రోజుల తర్వాత మీరు కమిట్‌మెంట్‌కి ఒకె కదా అని అడిగారు. వాళ్లు దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. వారితో నేను మీరు డేట్ చెప్పండి షూటింగ్‌కి వస్తాను అన్నాను. అది కాదు నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు.. నీకు రెండు లక్షలు ఇస్తా అతనితో నీకు కమింట్‌మెంట్ ఓకే కదా అన్నాడు. ఏదో తేడాగా ఉందని ఆ చాట్ మొత్తం స్క్రీన్ షాట్ తీసి నా స్నేహితుడికి పంపాను. ఆ చాట్ చదివి నా ఫ్రెండ్ అసలు నిజం చెప్పాడు. దాంతో నాకు చాలా బాదపడ్డాను. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయా… ఆ తర్వాత వాళ్ల చెక్ రిటన్ ఇచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన సినిమా విషయానికి వస్తే ‘రాజుగారి కోడి పులావ్’ ఆగస్ట్ 4న రిలీజ్ అయ్యింది. శివ కోన ముఖ్య పాత్రలో నటిస్తూ, నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఇందులో ఈటీవీ ప్రభాకర్ ముఖ్య పాత్ర పోషించాడు. రాజుగారి కోడి పులావ్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
View this post on Instagram
A post shared by Sha Chhabikala Films Pvt. Ltd. (@shachhabikala_fashion_products)