సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు గతంలో తాము పలు అవమానాలు పొందినట్లు పలు ఇంటర్వ్యూలో చెబుతుండటం తెలిసిందే.
ఆమె తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఒక స్టార్ హీరోయిన్ కి చెల్లెలు. తాను కూడా కొన్ని తెలుగు సినిమాల్లో నటించి అక్కకి తగ్గ చెల్లెలు అని నిరూపించుకుంది. ఆమె నటించిన ఒక తెలుగు మూవీలోని సాంగ్స్ అయితే నేటికీ చాలా చోట్ల మారు మోగిపోతుంటాయి. ఆమె కథానాయికగా చేసిన ఆ మూవీ ఆ రోజుల్లో పెద్ద సంచలనం.తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో బాలీ వుడ్ అగ్రనటుడు తీవ్ర స్థాయిలో నన్ను విమర్శించాడు అని చెప్పడం తో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా కలకలం రేగింది.
వంశీ దర్శకత్వం లో వచ్చిన మహర్షి మూవీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 1988వ సంవత్సరంలో వచ్చిన ఆ మూవీ లో శాంతి ప్రియ హీరోయిన్ గా చేసింది. ఆ మూవీలో చాలా అద్భుతంగా నటించి ఎంతో మంది యువతని తన అభిమానులుగా మార్చుకుంది.ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించినా కూడా మహర్షి సినిమా హీరోయిన్ గానే మాత్రం శాంతి ప్రియని ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. పలు తమిళ, హిందీ చిత్రాల్లో కూడా శాంతి ప్రియ నటించి తన సత్తా ని చాటింది. తనకి ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే మన పక్కింటి అమ్మాయి ఆ పాత్రలో నటిస్తుందనే ఫీల్ ని ఆడియన్స్ కి కలిగేలా చెయ్యడంలో శాంతి ప్రియ ముందు వరుసలో ఉంటారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శాంతి ప్రియ ఒక సంచలన వార్తని బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వార్త భారత దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. శాంతి ప్రియ తన కెరీర్ లో భాగంగా కొన్ని హిందీ సినిమాల్లోను నటించింది.అలా తాను ఒక హిందీ సినిమాలో నేటి బాలీ వుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా షూటింగ్ లో తన క్యారక్టర్ డిమాండ్ ప్రకారం శాంతి ప్రియ ఒక పొట్టి డ్రెస్ వేసుకోవలసి వచ్చింది. ఆ డ్రెస్ శాంతి ప్రియ మోకాలు ధాటి ఉంది. అప్పుడు అక్షయ్ కుమార్ శాంతి ప్రియ స్కిన్ కలర్ ని ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడుతు ఏంటి మోకాలికి ఏమైనా దెబ్బ తగిలిందా నల్లగా ఉందని అన్నాడు. ఇదంతా శాంతి ప్రియ తన ఇంటర్వ్యూ లో చెప్పింది.
ఇంకా శాంతిప్రియ చెప్తు అక్షయ్ కుమార్ అలా తనని ఎగతాళిగా మాట్లాడేసరికి అక్కడున్న పెద్ద పెద్ద నటులు సైతం నవ్వారు తప్పించి తనకి సపోర్ట్ గా మాట్లాడలేదని కూడా చెప్పింది. అక్షయ్ కుమార్ అలా బాడీ షైమింగ్ గురించి మాట్లాడేసరికి డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని మళ్ళీ మా అమ్మ వల్లనే మాములు మనిషిని అయ్యానని కూడా శాంతిప్రియ చెప్పింది. ఆ తర్వాత ఒకసారి అక్షయ్ కుమార్ తనతో నేను సరదాగా నీ రంగు గురించి మాట్లాడానని అన్నాడే తప్ప కనీసం సారీ కూడా చెప్పలేదని శాంతిప్రియ చెప్పింది. కాగా ఈ సంఘటన 1994 వ సంవత్సరం లో వచ్చిన ఇక్కే పే ఇక్క అనే హిందీ సినిమా షూటింగ్ లో జరిగింది.