జీవితంపై విరక్తి చెందినవారు.. సరైన ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నవారు.. అనారోగ్యంతో బాధపడేవారు తాము ఈ లోకంలో జీవించడం ఎందుకు అని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్రైన్ కింద పడి చనిపోతుంటారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్‌లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే ఆ ట్రైన్ పైలట్ ఎంతో చాకచౌక్యంగా ట్రైన్ ని ఆపడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ యువకుడు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్‌లో రైలు పట్టాలపై ఓ యువకుడు రైలు రావడాన్ని గమనించి.. పట్టాలపై పడుకున్నాడు. సదరు యువకుడు ఆత్మహత్యా యత్నం చేసుకుంటున్నాడని పసిగట్టిన లోకో పైలట్ రైలును యువకుడికి కొద్ది దూరంలోనే ఆపాడు. ప్లాట్ ఫాం వద్ద ఉన్న రైల్వే పోలీసులు.. యువకుడిని గమనించి అక్కడకు పరుగెత్తారు. అనంతరం బాధిత యువకుడిని చేరదీసి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. మొత్తానికి ఓ ప్రాణం కాపాడిన ఆ పైలట్ ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Mumbai Belapur local on harbour line. Suicide attempt foiled. Monday, 27 December, Sewri station. @mid_day pic.twitter.com/Pfo1pLoIMh
— Rajendra B. Aklekar (@rajtoday) December 29, 2021