గంధపు చెక్కల స్మగ్లర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది వీరప్పనే. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని అడువులను కొన్నేళ్ల పాటు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎర్రచందనం మొద్దులను స్మగ్లింగ్ చేశాడు. ఐదు రాష్ట్రాల పోలీసులు ఏళ్ల తరబడి ఏన్ని ప్రయత్నాలు చేసిన వీరప్పన్ దొరకలేదు. చివరకు అనారోగ్యంతో ఉన్న వీరప్పన్‌ను అండర్ కవర్లో ఉన్న పోలీసులు అంబులెన్స్ ఎక్కించి ట్రాప్ చేశారు. ఈక్రమంలో 2004లో వీరప్పన్ ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరప్పన్ సోదరుడు గుండెపోటుతో మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్(75) ఓ హత్య కేసులో తమిళనాడులోని సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మే 1న తీవ్ర గుండెపోటు రావడంతో పోలీసులు, మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి మే 25వ తేదీ ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. 1987లో ఫారెస్ట్ రేంజ్ అధికారి చిదంబరం హత్య జరిగింది.
ఇదీ చదవండి: ప్రియురాలి మీద కోపంతో ఆమె చెల్లి పెళ్లికి బాంబ్‌ని గిఫ్ట్‌గా పంపిన వ్యక్తి!

ఈ హత్య కేసులో మత్తయ్యన్‌ను ఈరోడ్ జిల్లా బంగ్లాపూడుర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులోనే మత్తయ్యన్కు జీవిత ఖైదు పడింది.ఈ క్రమంలో 34 ఏళ్ల నుంచి జైలులోనే ఉన్నాడు. మత్తయ్యన్ నూ విడుదల చేయాలని పలువురు పిటిషన్లు కూడా దాఖలు కావడం గమనార్హం. మరి.. వీరప్పన్ పెద్దన్న మృతి వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
