దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకా కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతూనే ఉన్నారు. టీకా తీసుకుంటే ఏం జరిగిపోతుందోననే ఆందోళనతో చాలామంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా అలాంటి భయంతోనే ఓ అమ్మాయి పరుగులు తీసింది. పైగా తనను ఎవరూ చూడకూడదని చెట్టెక్కి కూర్చుంది. అయితే ఆరోగ్య కార్యకర్తలు ఆ అమ్మాయికి సర్ది చెప్పి చెట్టు దగ్గరే వ్యాక్సిన్ వేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా చతర్పూర్ జిల్లాలో మనకరి గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తున్నారు. అలా వ్యాక్సిన్ వేయడానికి రీనా కరేరే అనే అమ్మాయి ఇంటికి వెళ్లారు. అయితే వారిని చూసి పరుగులు తీసినా రీనా ఏకంగా చెట్టెక్కి కూర్చుంది.
ఇది కూడా చదవండి : ఒకేరోజు తెరమీదకి రానున్న మహేష్ – చిరు సినిమాలు..!
వ్యాక్సిన్ వేయించుకోకపోతే కోవిడ్ వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని చెట్టు దగ్గరకు వెళ్లి రీనాకు సర్దిచెప్పారు సిబ్బంది. చివరికి రీనాను కన్విన్స్ చేసిన సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఒప్పించారు. అయితే చెట్టు దగ్గరే తనకు వ్యాక్సిన్ వేయాలని కోరింది. దాంతో చెట్టు కిందనే తనను కూర్చోబెట్టి రీనాకు టీకా వేశారు సిబ్బంది. వ్యాక్సినేషన్‌పై అవగాహన లేక మారుమూల ప్రాంతాలలో చాలామంది ఇలా టీకా వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.
Madhya Pradesh: Teen girl climbs tree to avoid getting vaccinated in Chhatarpurhttps://t.co/1pC4EjS6cx pic.twitter.com/HSML2rkBeC
— TOI Bhopal (@TOIBhopalNews) January 17, 2022