సాధారణంగా ఎవరికైనా చీమలు అంటే అయిష్టం. చిరుతిండి పదార్ధాలు ఎంత జాగ్రత్తగా పెట్టినా ఎక్కడి నుంచో అక్కడికి రావడం చూస్తూనే ఉంటాం. ఇక గండు చీమలు విషయానికి వస్తే మరీ డెంజర్.. అవి కుడితే మంటలెక్కిపోతాయి. అలాంటింది ఓ బాలిక కంటి నుంచి చలి చీమలు బయటకు రావడం మొదలు పెట్టాయి. ఇది వినడానికి కాస్త చోద్యంగా ఉన్నా.. తమిళనాడులో ఓ బాలికకు ప్రతిరోజూ సగటున 15 చీమలు బయటకు వస్తున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. రాణిపేట జిల్లాలో పూంగొడి, గాండీభన్ దంపతుల కుమార్తె షాలిని. 14 ఏళు ఉన్న ఈ అమ్మాయికి ఓ వింత వ్యాధి కోకింది.
ఈ బాలికకు ఎడమ కన్ను వాపు రావడంతో పాటు.. కంటి నుంచి చలి చీమలు బయటకు రావడం మొదలు పెట్టాయి. చీమలు వచ్చే సమయంలో బాలికకు విపరీతమైన కంటి నొప్పి రావడం చూసి తల్లిదండ్రులు విలవిలాడిపోతున్నారు. ఎన్నో ఆసుపత్రుల్లో చూపించారు. తమ పాపకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని తల్లిదండ్రులు కలెక్టర్ భాస్కర్ పాండియన్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ క్రమంలో కలెక్టర్ వాలాజలోని ప్రభుత్వ కంటి వైద్యశాలలో బాలికను చేర్పించి చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ బాలికను ప్రత్యేకంగా కంటి వైద్య నిపుణులు పరీక్షిస్తున్నారు.